Begin typing your search above and press return to search.

బోస్ ను సొంతం చేసుకుంటానంటే మోడీ ఒప్పుకుంటారా దీదీ?

By:  Tupaki Desk   |   17 Jan 2022 5:42 AM GMT
బోస్ ను సొంతం చేసుకుంటానంటే మోడీ ఒప్పుకుంటారా దీదీ?
X
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న విషయంలో తగ్గెదేలే అన్నట్లుగా మరోసారి ఫ్రూవ్ చేసింది మోడీ సర్కారుదాదా. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి.. ప్రధాని మోడీకి మధ్యనున్న రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ.. ఎవరికి వారు ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని చేస్తూనే.. ఏ చిన్న అవకాశం వచ్చినా ఇరువురు.. ఒకరికొకరు షాకులు ఇచ్చుకునే విషయంలో అస్సలు వెనక్కి తగ్గరు. ఎంతైనా ప్రధాన మంత్రి కావటంతో.. ఈ ఇద్దరు నేతల మధ్య పోరులో మోడీది పైచేయిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు బదులుగా.. ప్రజాబలంతో ఆ మధ్యన జరిగిన పశ్చిమ బెంగాల్అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం అన్నింటికి సమాధానాన్ని ఇచ్చేసిందని చెప్పాలి.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. మోడీ వర్సెస్ మమతగా మారటం తెలిసిందే. ఎన్నికల తర్వాత ఎవరి దారిన వారు ఉండటం.. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకున్నది లేదు. గత నెల(డిసెంబరు)లో ఢిల్లీకి వచ్చిన మమతా.. ప్రధాని మోడీని కలవటం.. వినతిపత్రాన్ని ఇవ్వటం.. తమ సమస్యలపై ప్రదాని మోడీ సానుకూలంగా స్పందించినట్లుగా దీదీ చెప్పటం తెలిసిందే.

తమ రాష్ట్రంలో సరిహద్దు భద్రత దళం పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహించుకోవాలని కోరిన ఆమె.. తమ రాష్ట్రంలో 2022లో జరిగే గ్లోబల్ బిజినెస్ మీట్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని అందజేశారు. ఇలా.. ఒకరికొకరు భేటీ కావటం.. వారి మధ్య సమావేశం సహ్రద్భావ వాతావరణంలో జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో.. కేంద్రానికి.. బెంగాల్ లోని మమతా సర్కారు మధ్య వైరం కాసింత తగ్గుముఖం పడుతుందా? అన్న క్వశ్చన్ పలువురిలో కలిగింది.

అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో చోటు చేసుకోదని.. దీదీని దెబ్బ తీసేందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదులుకోలేరన్న విషయాన్ని చెప్పే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా తమ రాష్ట్ర నుంచి సుభాస్ చంద్రబోస్ శకటాన్ని సిద్ధం చేసి ఢిల్లీకి పంపారు. దీనికి సంబంధించి అనూహ్య నిర్ణయాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్నట్లుగాచెబుతున్నారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని బెంగాల్ ప్రభుత్వం నేతాజీ శకటాన్ని పంపింది. అయితే.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బోస్ అభిమానులతో పాటు.. సీఎం మమత సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తమ శకటాన్ని రిజెక్టు చేయటానికి కారణం చెప్పాలని పట్టుబడుతున్నారు బెంగాల్ సీఎంగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ.

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టిన మమతా బెనర్జీ.. మోడీ సర్కారు నిర్ణయంపై బెంగాల్ ప్రజలు బాధ పడుతున్నారని.. నేతాజీ 125వ సంవత్సరాన్నిపురస్కరించుకొని.. బోస్.. ఆయన స్థాపించిన సేవల్ని స్మరించుకునే ఉద్దేశంతో తమ శకటాన్ని పంపినట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి బెంగాల్ ప్రభుత్వం పంపిన శకటాన్ని కేంద్రంలోనిమోడీ సర్కారు రిజెక్టు చేయటం హాట్ టాపిక్ గా మారింది. చక్కగా పోయేదానిని.. ఏదోలా కెలికి రచ్చ చేసుకోవటం మోడీ అండ్ కోకు ఒక అలవాటుగా మారిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.