Begin typing your search above and press return to search.

ఢిల్లీని తెలుగు రాష్ట్రాలు ఫాలో అవుతాయా ?

By:  Tupaki Desk   |   16 Sep 2021 12:30 PM GMT
ఢిల్లీని తెలుగు రాష్ట్రాలు ఫాలో అవుతాయా ?
X
దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల కొనుగోలు, నిల్వ, అమ్మకాలు, ఉపయోగించటాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే విషయమై కీలక ప్రకటన చేశారు. దీపావళి సందర్భంగా కాలుస్తున్న టపాకాయల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. వాయుకాలుష్యం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చాలా స్పీడుగా జరుగుతోందని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.

దీపావళి పండుగకే హైలైట్ గా నిలిచే టపాకాయలు కాల్చటాన్ని వాయుకాలుష్యం కరోనా వైరస్ నియంత్రణ కోసం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. పోయిన ఏడాది కూడా టపాకాయాలు కాల్చటాన్ని ఢిల్లీ ప్రభుత్వం సంపూర్ణంగా నిషేధించిన విషయం తెలిసిందే. మామూలుగా దీపావళి అంటేనే చైనా ఉత్పత్తులు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఒకపుడు టపాకాయలను మన దేశంలోని వివిధ ప్రాంతాల్లోనే తయారుచేసేవారు.

తమిళనాడులోని శివకాశి టపాకాయల తయారీలో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది మెల్లిగా దేశీయంగా టపాకాయల తయారీ పరిశ్రమను చైనా కంపెనీలు ఆక్రమించేశాయి. ఒక్క దీపావళి సందర్భంగానే చైనా నుండి కనీసం రు. 4 వేల కోట్లు విలువైన టపాకాయలు మనదేశంలోకి దిగుమతి అవుతున్నట్లు సమాచారం. మొదటిసారిగా రెండేళ్ళ క్రితం జమ్మూ-కాశ్మీర్ లడ్డాఖ్ లోయలోని గాల్వాన్ ప్రాంతంలో డ్రాగన్ సైన్యంతో జరిగిన గొడవ కారణంగా హఠాత్తుగా మనలో దేశభక్తి పొంగిపోయింది.

దేశభక్తి ఫలితంగా రెండేళ్ళక్రితం చైనా టపాకాయలను బహిష్కరించాలనే పిలుపు సోషల్ మీడియాను ముంచెత్తింది. దాని ఫలితంగా చైనా వ్యాపారంపై బాగా దెబ్బపడింది. సరే తర్వాత కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా టపాకాయల వ్యాపారం దెబ్బతిన్నది. మరి ఇపుడు తెలుగురాష్ట్రాల పరిస్ధితి ఏమిటి అనేది డౌటుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ తీవ్రత నూరుశాతం పోలేదు.

వాయు కాలుష్య, కరోనా వైరస్ సమస్యను నియంత్రించాలంటే టపాకాయలను నిషేధించడం ఒకటే మార్గమని ఢిల్లీ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇదే సందర్భంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నా వ్యతికించటంలో ప్రతిపక్షాలు పోటీపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి చూద్దాం ఏమి జరుగుతుందో.