Begin typing your search above and press return to search.

2024 ఐపీఎల్ లో ధోని ఇంపాక్ట్ ప్లేయరా? సీఎస్ కే కెప్టెనా?

By:  Tupaki Desk   |   29 May 2023 4:00 PM GMT
2024 ఐపీఎల్ లో ధోని ఇంపాక్ట్ ప్లేయరా? సీఎస్ కే కెప్టెనా?
X
ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తీసుకొచ్చిన ''ఇంపాక్ట్ ప్లేయర్'' రూల్ గురించి తెలిసిందే. దీని ప్రకారం.. కీలక సమయంలో బ్యాటర్ కానీ బౌలర్ గానీ రంగంలోకి దింపి మంచి ఫలితాల్ని సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూల్ కారణంగా సదరు ఆటగాడు 20 ఓవర్ల పాటు మైదానంలో ఉండాల్సిన అవసరం లేదు. అతనికి బదులుగా ఇంకొకరు ఉంటారు.

ఈ నిబంధన పుణ్యమా అని కొందరు సీనియర్ ఆటగాళ్లు బ్యాటింగ్ కానీ లేదంటే బౌలింగ్ కు కానీ పరిమితం కావటం చూస్తున్నాం. దీనికి ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ.. బెంగళూరుజట్టు సారథి డుప్లెసిస్ చక్కటి ఎగ్జాంపుల్ గా నిలుస్తారు.

వీరికి భిన్నంగా చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ఉపయోగించుకున్నది లేదు. ఈ ఐపీఎల్ టోర్నీ తర్వాత నుంచి ధోనీ గుడ్ బై చెబుతారని చెబుతున్నారు. అయితే..చెన్నై జట్టు కోచ్డ్వేన్ బ్రావో మాత్రం.. ఇంపాక్టు రూల్ తో ధోనీ మరికొన్నేళ్లు ఐపీఎల్ ఆడే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే.దీనిపై ధోనీస్పందించింది లేదు. కానీ టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం చెన్నై కోచ్ మాటల్ని సమర్థించకపోవటం గమనార్హం.

నలభైల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడటం పెద్ద కష్టమేమీ కాదని.. ఆ లెక్కన ధోనీ మరికొన్ని సీజన్ల పాటు ఆడే వీలుందని చెబుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడాల్సిన అవసంర లేదన్నది సెహ్వాగ్ అభిప్రాయం.

ధోనీ కేవలం కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడని.. మైదానంలోనూ వ్యూహాల్ని రచిస్తూ ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తున్నాడని.. ఇప్పటివరకు సాగిన ఐపీఎల్ సీజన్ లో చివరి రెండు ఓవర్లు మిగిలిన ఉన్న సమయంలోనే వచ్చాడని.. అతను మొత్తం 40 బంతుల్ని మాత్రమే ఎదుర్కొన్నాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ధోనికి ఇంపాక్టు ప్లేయర్ రూల్ వర్తించదని.. ఇప్పుడు ఆడుతున్నది సీఎస్ కేకు కెప్టెన్ గా ఉండటం కోసమేనని.. ధోనీ 20ఓవర్ల పాటు మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నాడని.. కెప్టెన్ కాకుంటే.. ఇంపాక్టు ప్లేయర్ గా కూడా ధోనీ ఆడడు అని స్పష్టం చేయటం గమనార్హం. అయితే.. ఫ్యూచర్ లో ధోనీని కోచ్ లేదంటే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిలో చూసే వీలుందన్న మాట సెహ్వాగ్ చెప్పటం విశేషం. మరి.. ధోనీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.