మోడీతో అన్నింట్లోనూ కటీఫే.. ఆ భేటికి కేసీఆర్ డుమ్మా?

Fri Nov 25 2022 11:00:01 GMT+0530 (India Standard Time)

Will ChiefMinister KCR Attend Modi Meeting

కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఇక నుంచి బీజేపీ ప్రభుత్వం పెట్టే సమావేశాలకు కూడా వెళ్లకూడదని పంతం పట్టాడు. రాష్ట్రపతి భవన్ లో డిసెంబర్ 5వ తేదీన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరుగనుంది. జీ20 దేశాల కూటమికి ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నాయకత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రపంచంలో భారత్ ను నిలబెట్టేలా చేయాలనుకుంటున్నారు. అందుకోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ కు కూడా కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. అయితే మోడీతో సమావేశం అంటే కేసీఆర్ ఇటీవల కాలంలో పూర్తిస్తాయిలో దూరం పాటిస్తున్నారు. ఈ సమావేశానికి వెళ్లరని భావించవచ్చు. అయితే ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

నిజానికి కేసీఆర్ ఢిల్లీ టూర్ కూడా ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన వెంటనే వివిధ రాష్ట్రాల ఇన్ చార్జీలను ప్రకటించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలపై ఓ స్పష్టత వచ్చింది. రైతు సంఘాల నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో చిన్న పార్టీలతో కలిసి నడుస్తారు. అయితే ఇలాంటి వారందరితో కేసీఆర్ ఢిల్లీలో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయన ఢిల్లీ వెళతారని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఆలస్యంతో ఆయన ఢిల్లీ టూర్ వాయిదా పడుతోంది.

ఇక డిసెంబర్ 7వ తేదీలోపున టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారే అవకాశాలున్నాయి.బీఆర్ఎస్ గురించి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో ప్రకటించాలనుకోవడం లేదు. జాతీయస్థాయిలోనే ప్రకటన ఉండనుంది.

అందుకే బీఆర్ఎస్ గురించి కేసీఆర్ ప్రస్తావించడం లేదు.  దేశ ప్రజలందరి ముందు తన ఆలోచనలు జెండా అజెండా ప్రకటించాలనుకుంటున్నారు. అందుకే ఇతరులతో చర్చలు జరపడం లేదు. ఈ క్రమంలోనే మోడీ పర్యటనకు వెళతారా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.