Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో బీజేపీ స్టాండ్ మారుతుందా...?

By:  Tupaki Desk   |   19 March 2023 9:59 AM GMT
జగన్ విషయంలో బీజేపీ స్టాండ్ మారుతుందా...?
X
రాజకీయంలో స్నేహాలు అభిమానాలు అన్నవి ఏవీ ఉండవు. ఇక్కడ అంతా సీట్ల ఓట్ల లెక్కలు మాత్రమే. వైసీపీకి దండీగా ఎంపీలు ఉన్నారు ఉభయ సభలలో ముప్పయికి తక్కువ కాకుండా ఎంపీలు ఉన్నారు కాబట్టి మర్యాదను ఇచ్చి పుచ్చుకుంటున్నారు కేంద్ర బీజేపీ పెద్దలు. అంతే కాదు ఈ మధ్య దాకా వారికి ఉన్న ఆశలు కానీ భ్రమలు కానీ ఏపీలో మళ్లీ జగనే తిరిగి పవర్ లోకి వస్తారని.

అయితే ఇపుడు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అందరికీ కళ్ళు తెరిపించేసాయని అంటున్నారు. పట్టభద్రులు అంటే కాస్తా వివేచన ఉన్న వారు. అన్ని విషయాలు ఆకలింపు చేసుకుని ఆలోచించి తీర్పు చెప్పేవారుగా ఉన్నారు. వారికి తమ రాష్ట్రం మీద మమకారం ఎక్కువ. అలాంటి వారు ఏపీ అప్పుల కుప్ప మీద అభివృద్ధి లేమి మీద పంచుడు కార్యక్రమాలకు నిరసంగా వేసిన ఓటుతో వైసీపీ ఆశల సౌధాన్ని ప్రశార్ధకం చేసి
పారేశారు.

ఏపీలో తెలుగుదేశం మూడు పట్టభద్రుల సీట్లను గెలుచుకుని తిరిగి సూపర్ లెవెల్ లో సౌండ్ చేయడం. ఇవన్నీ కూడా ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పడుతున్నాయి. మరి ఏపీలో రాజకీయంలో ఇంత చేంజి వస్తూంటే బీజేపీకి చెందిన కేంద్ర పెద్దలు ఇంకా నమ్మకంగా వైసీపీ విషయంలో ఉంటారా అన్నది పెద్ద చర్చగా ఉంది.

బీజేపీ కేంద్ర పెద్దల విషయం తీసుకుంటే కేవలం రాజకీయమే ప్రధానంగానే బంధాలు అనుబంధాలు అన్న వైఖరి తో కఠినంగా కచ్చితంగా ఉంటారని అంటారు. అదే అంతా చూస్తున్నారు కూడా. అలాంటిది బీజేపీ పెద్దల వద్ద ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు ఉంటాయి. అదే సమయంలో వారి సొంత సర్వేలు ఎటూ ఉంటాయి.

అయితే వాటిని తలదన్నెలా రియల్ రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్ లో పక్కా నివేదిక ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో చేతికి వచ్చింది. నిజానికి ఏపీలో ఏ పార్టీకు బలం ఉంది అన్న దాని మీద బీజేపీ ఏప్రిల్ తరువాత ఒక సర్వే చేయించాలని చూస్తోంది అని ఒక ప్రచారం అయితే సాగింది. అయితే ఇపుడు అలాంటి సర్వే అవసరం లేకుండానే వైసీపీ పొలిటికల్ సీన్ ఏంటో కళ్ళ ముందు పెట్టేశారు పట్టభద్రులు.

వైసీపీ వరకూ ఇవి మా ఫలితాలు కావు మా బలం ఇది కాదు అని ఎంత మొరాయించినా ఏపీలో సగటు జనంలోనూ ఇదే చర్చ గట్టిగా సాగుతోంది. అన్ని వర్గాలలోనూ ఇపుడు ఏపీలో అధికారం మారుతోందా అన్న దాని మీదనే చర్చగా ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ నాలుగేళ్ళుగా అండగా వైసీపీకి ఉంటోంది.

ఇపుడు కేంద్ర పెద్దలు కనుక షాకిస్తే పరిస్థితి ఏంటి అన్నదే రాజకీయ వర్గాలలోనూ సాగుతున్న చర్చ. ఎన్నికల ఏడాది బోలెడు అవసరాలు వైసీపీకి ఉంటాయి. కధ సాఫీగా నడవాలంటే అడుగడుగునా కేంద్రం సాయం చేస్తూ ఉండాలి. అలాంటి కీలక సమయంలో వైసీపీ రాజకీయ డొల్లతనాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిండా చూసేసిన కాషాయం పార్టీ సాంతం ముంచేయడానికి సిద్ధపడితే అపుడు గతీ గత్యంతరం ఏంటి అన్నదే కీలకమైన డిస్కషన్ ట. అంటే ఇపుడు బీజేపీ స్టాండ్ ఏపీ మీద వైసీపీ మీద ఏంటి అన్నదే అందరికీ ఆసక్తిని కలిగించే అంశం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.