అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. భర్త ఏం చేశాడంటే ?

Sat Jul 24 2021 17:00:02 GMT+0530 (IST)

Wife having an affair What did the husband do

అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. ఎంతో సఖ్యతగా ఉండాల్సిన భార్యాభర్తల నడుమ ఇవే చిచ్చు రాజేస్తున్నాయి. చివరికి పరిస్థితి కొన్ని చోట్ల చంపుకోవడం వరకూ వెళ్తోంది. భార్య మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న విషయం తెలుసుకున్న భర్త ఆమె ఇష్టపడే వాడి పై కోపాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే  ఆమె ప్రియుడిపై దాడి చేశాడు తాజాగా పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో  ఇలాంటి ఘటనే జరిగింది. భార్య ప్రియుడి మాయలో పడిన సంగతి తెలిసి ఆ ప్రియుడ్ని భర్త ముక్కు చెవులు కోసేశాడు.వివరాల్లోకి వెళ్తే .. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రం ముజఫర్ గడ్ కి చెందిన అక్రమ్ అనే వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం భర్త ఖయ్యుమ్ ఆగ్రహం తో ఊగిపోయాడు. సమయం చూసి పదునైన కత్తితో అక్రమ్ ముక్కు చెవులు కోసేశాడు. ఆ తర్వాత తీవ్ర రక్త స్రావం అవుతోన్న అక్రమ్ ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత ఆ ఘటన ను చూసిన స్థానికులు దాన్ని గమనించి అతన్ని హాస్పిటల్ లో చేర్పించారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.