Begin typing your search above and press return to search.

భర్త వీర్యం కోసం భార్య కోర్టుకి .. తర్వాత రోజే ఇంట్లో విషాదం !

By:  Tupaki Desk   |   23 July 2021 1:30 PM GMT
భర్త వీర్యం కోసం భార్య కోర్టుకి .. తర్వాత రోజే ఇంట్లో విషాదం !
X
కరోనా మహమ్మారి బారినపడి చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త నుంచి వీర్యాన్ని సేకరించేలా ఆదేశించాలని కోరుతూ ఓ మహిళ గుజరాత్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం.. వీలైనంత తర్వగా అతడి నుంచి వీర్యాన్ని సేకరించాలని ఆస్పత్రిని మంగళవారం సాయంత్రం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వైద్యులు అతడి నుంచి బుధవారం విజయవంతంగా వీర్యం సేకరించారు. అయితే , ఆమె ఇంట్లో తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో వీర్యం సేకరించిన ఒక్కరోజు తర్వాత.. ఆమె భర్త తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని సదరు మహిళ తరఫు న్యాయవాది నీలాయ్ పటేల్ శుక్రవారం వెల్లడించారు ఈ కేసుపై తదుపరి విచారణకు కొద్ది గంటల ముందే ఈ ఘటన జరిగింది. వడోదరాలోని స్టెర్లింగ్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న తన భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్ విధానంలో తల్లి కావాలని ఓ మహిళ కోరుకుంది. అయితే అందుకు డాక్టర్లు నో చెప్పారు. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటే తాము వీర్యాన్ని సేకరిస్తామని చెప్పారు. దీంతో గుజరాత్ హైకోర్టులో ఆ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం, సదరు కరోనా బాధితుని నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని నిర్దేశించింది.

తర్వాతి ఆదేశాలు ఇచ్చే వరకు దాన్ని తగిన విధంగా స్టోర్ చేయాలని సూచించింది. కోర్టు ఆదేశించిన తర్వాత మంగళవారమే ఆ వ్యక్తి వీర్యాన్ని డాక్టర్లు సేకరించారని స్టెర్లింగ్ ఆస్పత్రి జోనల్ డైరెక్టర్ అనిల్ నంబియార్ బుధవారం తెలిపారు. కోర్టు అనుమతి ఇస్తే ఐవీఎఫ్ విధానం కోసం దాన్ని వినియోగిస్తామని వెల్లడించారు. కాగా ఎమర్జెన్సీ వార్డులో కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్న భర్త నుంచి వీర్యం కోసం సదరు మహిళ కోర్టుకు వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వడోదరలోని స్టెర్లింగ్ హాస్పిటల్స్ జోనల్ డైరెక్టర్ అనిల్ నంబియార్ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలు వచ్చిన కొద్ది గంటల్లోనే మంగళవారం రాత్రి కోవిడ్ బాధితుడి నుంచి వైద్యులు విజయవంతంగా వీర్యం సేకరించారని తెలిపారు. రోగి కుటుంబం ఈ విధానాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది.. కానీ ఈ ప్రక్రియ ఎవరిపై నిర్వహించాలో ఆ వ్యక్తి సమ్మతి ఇందుకు అవసరం.. ఆయన నిర్ణయం చెప్పే పరిస్థితిలో లేనందున కోర్టు అనుమతితోనే మేం అలా చేయగలమని చెప్పాం అని అన్నారు.