Begin typing your search above and press return to search.

పుతిన్ కుమార్తె ఎవరు? ఆమె ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   13 Aug 2020 11:10 AM GMT
పుతిన్ కుమార్తె ఎవరు? ఆమె ఏం చేస్తారు?
X
ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను రష్యా దేశం సిద్ధం చేసింది. రెండు నెలలపాటు పరిశోధించి దీనిని సరైన వ్యాక్సిన్ గా నిర్ధారించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అంతేకాదు.. దీనిపై అన్ని దేశాలు వారు అనుమానాలు చేస్తారని ముందే గ్రహించి ఏకంగా వ్యాక్సిన్ ను తన కూతురుకు కూడా ఇప్పించానని వీడియో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రష్యా ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆమోదించిన ఈ వ్యాక్సిన్ ను త్వరలోనే భారీగా ఉత్పత్తి చేసి రష్యా ప్రజలతోపాటు మిగతా దేశాల ప్రజలకు ఇస్తామని పుతిన్ ప్రకటించారు.

రష్యా వ్యాక్సిన్ ను మొదటగా ఇచ్చిన వారిలో తన కూతురు కూడా ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించి సంచలనం రేపారు. ఇంతకీ పుతిన్ కు ఎంతమంది పిల్లలు? వారు ఏం చేస్తారన్నది అత్యంత రహస్యంగా ఉంటుంది.

పుతిన్ కు ఇద్దరు కూతుళ్లున్నారు. వారిలో ఏ కూతురుకు ఇచ్చానన్నది ఆయన పేర్కొనలేదు. పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యాక ఆయన కుటుంబం, సంతానం, వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగానే ఉంచారు.

పుతిన్ కు మారియా పుతినా, యెకటెరీనా పుతినా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు సమాచారం. ఇందులో యెకటేరియా చిన్న కుమార్తెగా చెబుతారు.

పుతిన్ చిన్నకూతురు యెకటేరియా అక్రోబాటిక్ డ్యాన్సర్. పలు టీవీషోల్లోనూ కనిపించారు. మాస్కో స్టేట్ యూనివర్సిటీలో న్యూ ఇంటెలిజెన్స్ ఇనిస్టిట్యూట్ కు అధిపతిగా ఉన్నారని సమాచారం.

పుతిన్ పెద్ద కూతురు మారియా పుతినా ఎండోక్రినాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఎండోక్రినాలజీ సెంటర్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నట్టు సమాచారం.

అయితే వారి భద్రత దృష్ట్యా పుతిన్ వారిని తనకు దూరంగా రహస్యంగా జీవించేలా చేస్తున్నారు. వారూ సాధారణ జీవితం గడిపేలా తన కూతుళ్లుగా తెలియకుండా పేర్లు మార్చి జీవించేలా చేస్తున్నారు. మాస్కోలోనే ఈయన ఇద్దరు కూతుళ్లు వేరే పేర్లతో జీవిస్తున్నారు.

పుతిన్ 1983లో లుడ్మిలాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2014లో ఈ జంట విడిపోయారు.

ఇందులో శాస్తవేత్త అయిన మారియానే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు వార్తా సంస్థలు చెబుతున్నాయి.