ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా : తొలి వన్డేలో గెలుపెవరిది?

Fri Mar 17 2023 10:15:39 GMT+0530 (India Standard Time)

Who Will Win in India Vs Australia ODI

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-1తో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా ఇప్పుడు వన్డేలకు సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్  ముందర బలమైన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. టెస్ట్ సిరీస్ విజయంతో టీమ్ ఇండియా ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు కూడా బెర్త్ను ఖరారు చేసుకుంది. వన్డే ప్రపంచ కప్ సన్నాహాలపై దృష్టి సారిస్తూ మూడు మ్యాచ్ల వైట్-బాల్ సిరీస్లో ఆస్ట్రేలియాతో భారత్ తన పోటీని తిరిగి ప్రారంభించనుంది.ఇప్పటికే ప్రీమియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కోల్పోయిన ఆతిథ్య జట్టు వన్డే సిరీస్కు ముందు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మొత్తం వన్డే సిరీస్కు దూరమయ్యాడు. వెన్నులో గాయం పునరావృతం కావడంతో ముంబై బ్యాటర్ వన్డే సిరీస్కు దూరమయ్యాడు. వన్డే సిరీస్కి అయ్యర్ స్థానంలో భారత జట్టులోకి ఇంకొకరిని తీసుకోలేదు.

తొలి వన్డేలో వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ దూరమయ్యాడు. తన కుటుంబానికి సంబంధించిన పని నిమిత్తం సెలవు తీసుకొని వెళ్లాడు.దీంతో హార్ధిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్ గా తొలి వన్డేను లీడ్ చేయనున్నాడు. రెండో వన్డేకు రోహిత్ వస్తాడు.

ఇక ఆస్ట్రేలియా బలంగా ఉంది. డేవిడ్ వార్నర్ రాకతో పటిష్టంగా తయారైంది. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వన్డేలకు సిద్ధమైంది. గ్రీన్ స్మిత్ వార్నర్ వంటి బలమైన ఆటగాళ్లు ఆ టీంకు ఉన్నారు.  

రెండు జట్ల మధ్య మొదటి వన్డేకు ముందు మాట్లాడిన స్టాండ్-ఇన్ కెప్టెన్ పాండ్యా టీంలోకి సూపర్ స్టార్ ఇషాన్ కిషన్ ఇన్-ఫామ్ బ్యాటర్ శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారని ధృవీకరించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ ను డిస్నీ+హాట్ స్టార్ లో స్టార్ స్పోర్ట్స్ లో ప్రేక్షకులు చూడొచ్చు.  

  భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి వన్డే శుక్రవారం (మార్చి 17) జరగనుంది. 1వ వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.    నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.