బైడెన్ వచ్చినా.. హింస ఆగట్లేదు.. కాల్పుల్లో గర్భిణి సహా ఆరుగురు మృతి

Mon Jan 25 2021 13:00:04 GMT+0530 (IST)

When Biden arrived, the violence did not stop. Six people, including a pregnant woman, were killed i

అమెరికాలో గన్ లైసెన్స్ తీసుకోవడం చాలా సులభం అన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ హింసకు అడ్డు అదుపులేకుండా పోతుంది.  నల్లజాతీయులు శ్వేత జాతీయులు విద్వేషాలతో అమెరికా అట్టుడుకుతూ ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున ఇండియానా రాష్ట్రంలో దుండగులు రెచ్చిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ గర్భిణి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈఘటనపై అమెరికన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. గర్భిణిపై కాల్పులు జరపడం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు పోలీసులు కూడా విచారణ ముమ్మరం చేశారు. పుట్టబోయే బిడ్డతో సహా  గర్భిణీ స్త్రీ  చనిపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించామని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. అయితే అమెరికాలో కాల్పులు జరగడం కొత్త కాదు. గతంలోనూ పలు మార్లు పాఠశాలల చిన్నారులపై దాడులు జరిగాయి. అయితే ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు జాతి వివక్ష పెరిగిందని.. శ్వేత జాతీయులు రెచ్చిపోయారన్న వార్తలు వినిపించాయి. ఓ నల్ల జాతీయుడిని పోలీసులు కొట్టిచంపడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదం అయింది.

అయితే తాజాగా జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యారు. డెమోక్రాటిక్ పార్టికి ప్రజాస్వామ్య లౌకిక పార్టీ అన్న ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రశాంతంగా ఉంటుందని.. విదేశాల వాళ్లు వలసదారులు కూడా క్షేమంగా ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. ఈ నేపథయంలో కాల్పులు జరగడం గమనార్హం.