పవన్ కామెంట్స్ పై.. ఏపీ మంత్రుల రియాక్షన్ ఏంటి?

Mon Nov 28 2022 11:00:43 GMT+0530 (India Standard Time)

What is the reaction of AP ministers on Pawan's comments?

తాజాగా వైసీపీ ప్రభుత్వంపైనా సీఎం జగన్పైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ చేసిన వ్యాఖ్యలపై గంటల వ్యవధిలో ఏపీకి చెందిన మంత్రులు రియాక్ట్ అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట మాట్లాడినా.. అందరి ఫైర్ ఒక్కటే అన్నట్టుగా విరుచుకుపడ్డారు. మరి ఎవరెవరు ఏమన్నారో చూద్దామా..!175 చోట్ల గెలిస్తే.. నువ్వే హీరో: మంత్రి రోజా..వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానన్న జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించా రు. షూటింగ్ గ్యాప్లో వచ్చి రెండు గంటలు వీకెండ్ మీటింగ్లు పెడితే ప్రజలు నమ్మరని పవన్ గ్రహించాలని..  సూచించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును ఆవేశంగా చదివితే సరిపోదన్నారు. ఇప్పటంలోని ప్రజలే పవన్ను రావద్దని ప్లెక్సీలు పెట్టారని పేర్కొన్నారు. జనసేన తరపున 175 స్థానాల్లో పోటీ చేసి హీరో కావాలని సూచించిన రోజా.. బాధ్యత ఓర్పులేని నాయకులెవరికీ ప్రజలు ఓటు వేయరని వ్యాఖ్యానించారు.

అది సైకో సేన: మంత్రి జోగి రమష్..వచ్చే ఎన్నికల్లో అంతా కలిసొచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచు కూడా కదపలేరని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. సీఎం జగన్ నాయకత్వాన్ని దేశమంతా హర్షిస్తోందని  తెలిపారు. 'పవన్ కల్యాణ్ పగటి వేషగాడు. ఏపీకి విజిటింగ్ వీసా మీద వచ్చి మీడియాలో మాట్లాడి పారిపోతాడు.

జనసేన కాదు.. అది సైకో సేన. సీఎం జగన్ నాయకత్వాన్ని దేశమంతా హర్షిస్తోంది. అంతా కలిసొచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచు కూడా కదపలేరు. 2024లో పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం’ అని జోగి రమేష్ పేర్కొన్నారు.

చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే: పేర్ని నాని 'టీడీపీ అధినేత చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్ తాపత్రయపడుతున్నాడు. సీఎం జగన్ పట్ల విద్వేషం తప్ప పవన్ మాటల్లో ఇంకేమీ లేదు. సమాజం కోసం పవన్ మాట్లాడింది ఏమీలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో పొలాలను నాశనం చేసినప్పుడు పవన్కు ఏం గుచ్చుకోలేదా?. చంద్రబాబు కాళ్ల దగ్గర చోటుంటే చాలన్నది పవన్ ఆలోచన. మోడీతో పవన్ ఏం మాట్లాడితే మాకెందుకు?. రూట్మ్యాప్ మోడీ ఇవ్వాలి అంటారు.

ఒక పార్టీ స్థాపించిన వ్యక్తి రూట్ మ్యాప్ కోసం ఇంకొకరిని అడుగుతారా?. మోడీ కాళ్లు పట్టుకునేది నువ్వే.. పారిపోయేది నువ్వే. 2024లో వైసీపీకి 175 సీట్లు వస్తే నువ్వు చూస్తూనే ఉంటావ్ పవన్. పవన్ విధానాలు చూసే ప్రజలు ఓటేయలేదు. 2024లో కూడా వేయరు. పవన్ మాటలు వీడియోలు మ్యూజియంలో పెట్టాలి. పవన్... ఓ వీకెండ్ పొలిటీషన్ పవన్’ అని నాని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.