Begin typing your search above and press return to search.

టీటీడీ ఈవో కుమారుడికి అసలు ఏమైంది?

By:  Tupaki Desk   |   19 Dec 2022 6:30 AM GMT
టీటీడీ ఈవో కుమారుడికి అసలు ఏమైంది?
X
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వాహక అధికారి (ఈవో) ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) గుండెపోటుకు గురి కావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన పరిస్థితిపై ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు.

కాగా 28 ఏళ్ల చంద్రమౌళి ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే సివిల్స్‌ కు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆయన గతంలో కోవిడ్‌ బారినపడ్డారని.. పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాల వల్లే హార్ట్‌ ఎటాక్‌ కు గురి అయి ఉంటారని తెలుస్తోంది.

ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో చంద్రమౌళితో వివాహం కుదిరింది. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం కూడా జరిగిందని సమాచారం. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరపడానికి పెద్దలు నిశ్చయించారు.

ఈ క్రమంలో రెండు కుటుంబాలవారు పెళ్లికి రావాలని బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి డిసెంబర్‌ 18న కారులో వెళ్లారు. ఈ క్రమంలో కాసేపటికే గుండెనొప్పిగా ఉందని తన పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే శేఖర్‌రెడ్డి తదితరులు అక్కడకు చేరుకున్నారు.

కాగా చంద్రమౌళి గుండెపోటుకు గురయిన విషయం తెలుసుకున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు చెన్నై కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రమౌళిని పరామర్శించారు.

అలాగే ధర్మారెడ్డి సన్నిహితులు జరిగిన ఘటన గురించి మీడియాకు సమాచారమిచ్చారు. 'చంద్రమౌళి తన వివాహ ఆహ్వానపత్రిక ఇవ్వడానికి వెళ్తుండగా ఆయనకు గుండెనొప్పి వచ్చింది. వెంటనే కావేరి ఆస్పత్రిలో చేర్పించాం. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. నిదానంగా కోలుకుంటున్నారు' అని పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.