కుప్పంలో ఘోర ఓటమి తర్వాత బాబు ఏం చేశాడంటే?

Sat Feb 20 2021 21:00:02 GMT+0530 (IST)

What did Babu do after the terrible defeat in Kuppam

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాదాపు 90శాతం గ్రామాలను వైసీపీ చేజిక్కించుకుంది. దీంతో చంద్రబాబు పని అయిపోయిందని.. ఆయన నియోజకవర్గం మారాలని వైసీపీ నేతలు సెటైర్లు వేశారు.ఈ ఘోర ఓటమి తర్వాత కుప్పం టీడీపీ నేతలతో సమీక్షించిన చంద్రబాబు వారికి హితబోధ చేశారు. ఈ వైఫల్యానికి కారణం అధికార పార్టీ చేసిన రౌడీయిజం అని.. డబ్బులు పంచి అధికారులతో కుమ్మక్కై అక్రమంగా పంచాయతీలను గెలిచారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నాయకులు కూడా పోలింగ్ బూతులను వదిలి కౌంటింగ్ విడిచి పెట్టి తిరిగారని.. వైసీపీ నేతలు ఫలితాలను మార్చి వైసీపీ గెలిచిందని అధికారుల చేత చెప్పుకొచ్చారని చంద్రబాబు ఆరోపించారు.

ఫలితాల వద్ద ఉండి రీకౌంటింగ్ కోరి ఉంటే ఫలితాలు వేరేలాగా ఉండేవని.. వైసీపీ నేతలు దగ్గరుండి అక్రమంగా గెలిపించుకున్నారని చంద్రబాబు నేతలతో అన్నారు. స్థానిక నాయకుల్లోని లోపాలను చంద్రబాబు వేలెత్తి చూపారు. కుప్పం వ్యక్తిత్వాన్ని ఈ ఫలితాలు దెబ్బతీశాయన్నారు.తానే రెండు మూడు రోజుల్లో కుప్పం వచ్చి పరిస్థితులను చక్కదిద్దుతానని చంద్రబాబు నేతలకు భరోసా ఇచ్చారు.