ఓడిపోయినా మమతనే సీఎం.. ట్విస్ట్ ఇదే

Tue May 04 2021 10:12:10 GMT+0530 (IST)

West Bengal Elections Results 2021

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. కానీ మమతా బెనర్జీ ఓడిపోయింది. బెంగాల్ లో మూడోసారి అద్భుత మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. బలమైన బీజేపీని ఓడించింది.  అయితే మమత మాత్రం నందిగ్రామ్ లో ఓడిపోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓడిపోవడం తృణమూల్ వర్గాలకు షాక్ ఇచ్చింది. దీంతో 217 మంది ఎమ్మెల్యేలు గెలిచారనే సంతోషం మమతకు లేకుండాపోయింది.అయితే ఆరునెలల వరకు మమతా బెనర్జీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డు లేదు. కాకపోతే ఆరు నెలల వరకు ఎలాగైనా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నిక కావాల్సి ఉంది.

ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డు లేదు. కాకపోతే ఆరునెలల వరకు ఎలాగైనా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నికై ఉండాలి.

ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే మమత ఎమ్మెల్యేగానైనా.. ఎమ్మెల్సీగానైనా గెలిచి ఉండాలి. కానీ బెంగాల్ లో శాసనమండలి లేదు. దీంతో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యే అవకాశం లేదు.

బెంగాల్ లోని సంసర్ గంజ్ ముర్షిదాబాద్ స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించలేదు. ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట మమత పోటీచేయాల్సి ఉంది. ఏదో ఒక చోట గెలిస్తే ముఖ్యమంత్రిగా సేఫ్ గా ఉంటుంది. లేదంటే ఆమె స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంటుంది. బీజేపీ మమతను ఓడించడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. దీంతో ఈ గండాన్ని ఎలా గట్టెక్కిస్తుందనేది వేచిచూడాలి.