Begin typing your search above and press return to search.

మోడీ.. జగన్.. చేస్తున్న తప్పులేమిటో చెప్పిన ఉండవల్లి

By:  Tupaki Desk   |   23 Sep 2021 12:30 PM GMT
మోడీ.. జగన్.. చేస్తున్న తప్పులేమిటో చెప్పిన ఉండవల్లి
X
రాజకీయ నేతగా సుపరిచితుడు అయి ఉండి.. ఏ రాజకీయ పార్టీలో లేకుండా ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏ పార్టీలో లేకుండా రాజకీయ నేతగా సుపరిచితుడిగా.. సదరు ప్రముఖుడు చెప్పే మాటలకు ప్రజల్లో ఆసక్తి వ్యక్తం కావటం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి అరుదైన టాలెంట్ ఎవరికైనా ఉందంటే అది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కే చెల్లుతుంది.

రాష్ట్ర విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక స్టేట్ గా ఏర్పడితే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చప్పటమే కాదు చేసి చూపించారు లగడపాటి రాజగోపాల్. రాజకీయాల నుంచి దూరం అవుతానని చెప్పిన ఆయన.. మళ్లీ ఆయన కనిపించటం మానేశారు. ఎప్పుడైనా ఎన్నికల సమయంలో కనించటమే కాదు.. రోటీన్ రాజకీయ అంశాల మీద మాట్లాడటం లాంటివి ఆయన మానేశారు.

ఉండవల్లి విషయానికి వస్తే.. కాంగ్రెస్ నుంచి వైదొలిగిన తర్వాత.. మరే పార్టీలో చేరకుండా ఉండటం ఒక ఎత్తు అయితే.. సమకాలీన రాజకీయాల మీద వ్యాఖ్యలు చేయటం.. ఆయన చెప్పే మాటల వీడియోలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ ఎంతలా పాపులర్ అవుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త గుజ్జున్న రాజకీయ నేతల్లో.. పార్టీలకు అతీతంగా ఎవరినైనా పొగడాలన్నా.. విమర్శించాలన్నా.. శషభిషలు లేకుండా సూటిగా విషయాల్ని చెప్పేయాలన్నా ఉండవల్లి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.

తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. అప్పులు చేయటం తప్పు కాదు కానీ వాటిని పెట్టుబడుల మీద పెట్టాలే కానీ ఫ్రీ బీస్ కోసం ఖర్చు చేయకూడదని.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుగా చెప్పారు. ఇంకా ఆయనేం అన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

ఓపక్క మోడీనే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. ప్రైవేటు వాళ్ల దగ్గర నుంచి తీసుకొని నేనే రన్ చేస్తానని చెబుతున్నారు. ఈ రెండిటిలోనూ తీవ్రతకు వెళ్లటమంటే.. ‘మనకు షో రన్ చేయటం చేతనవటం లేదని అర్థం’అని వ్యాఖ్యానించారు. ఇంతకాలం రన్ అయిన పద్దతిని మరింత మెరుగ్గా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారే తప్ప.. చేతకాక అప్పజెప్పేస్తామన్న పద్దతికి తీసుకొస్తారని ప్రజలు అనుకోరని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందన్నారు.

అప్పులు చేయకుండా ఉండమని తాను అనటం లేదని. అప్పులు చేయకుండా ఉండటం అసలు సాధ్యం కాదన్నారు. ‘‘కాకుంటే.. ఎప్పుడూ కూడా రెండింటి మధ్య బ్యాలెన్సు ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఫిగర్స్ ఎప్పుడు సర్ ప్లస్ (మిగులు)లో ఉంటుంది. రోశయ్యగారు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఏ రోజు ఓవర్ డ్రాప్టు వెళ్లారో ఒక్కసారి లెక్కలేసుకోండి. నవరత్నాల్ని అంచనా వేయకుండానే ప్రకటించి ఉంటారని అనుకోవటం లేదు. కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయాయి కదా? అందుకే కదా తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలు అప్పులు చేశాయని అంటున్నారు కదా. అసలు వీళ్లందరి కంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసింది. రూ.60లక్షల కోట్ల అప్పు చేశారు’ అని విశ్లేషించారు.

ఎవరైనా అప్పుల గురించి అడిగితే.. పెట్రోల్.. డీజిల్ ధరలు పెంచాం.. దాని మీద వచ్చే ఆదాయంతో కాంగ్రెస్ వాళ్లు చేసిన అప్పులన్ని తీరుస్తున్నామని చెబుతుంటారని.. అవన్నీ అబద్ధాలన్నారు. ‘‘అందులో అస్సలు నిజమే లేదు. సాక్ష్యాత్తు లోక్ సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మంత్రి సమాధానం చెబుతూ.. ఈ దేశంలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని చెప్పారు. ఎవరు చచ్చిపోలేదా? నాకు బాగా తెలిసి ఈ రాజమండ్రిలోనే పది మంది చనిపోయారు. కారులో వెళుతూ.. ఆటోలో వెళుతూ.. ఆసుపత్రికి వెళ్లి.. అక్కడ కూర్చొని.. ఆక్సిజన్ అందక చచ్చిపోతున్న వాళ్ల వీడియోలు మీరెన్ని(మీడియాను ఉద్దేశించి) చూపించారు? సాక్ష్యాత్తు కేంద్రమంత్రి ఆ మాట చెబితే.. ఇదేమని అడిగితే.. మాకు ఈ సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పారు. తిరుపతి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 14 మంది చనిపోతే.. 10 మందికే డబ్బులు ఇచ్చారు.. మిగిలిన నలుగురికి ఎందుకు ఇవ్వలేదని పెద్ద ఆందోళన చేశారు. పది మందికి డబ్బులు కూడా ఇచ్చారు.. ఇదంతా ప్రభుత్వ పొరపాటేనని. అవన్నీ ఆక్సిజన్ డెత్ లు కావా? ఏమైనా చెప్పొచ్చు అన్నట్లుగా మారింది. ఏమైనా చెప్పొచ్చు.. ఎంతైనా అప్పు తేవొచ్చు. ఏమన్నా అంటే కోవిడ్ అంటున్నారు’ అని అన్నారు.

ఒక రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెడితే కానీ బ్యాంకులు అప్పులు ఇస్తామంటున్నాయి. ఎస్క్రో అకౌంట్ ఇవ్వటం అంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అవమానకరం? వచ్చిన ఆదాయంలో వారికి రావాల్సిన మొత్తాన్ని మినహాయింపుకున్న తర్వాత మిగిలిన డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఫ్రీ బీస్ కోసం అప్పులు చేయటం జగన్ చేస్తున్న తప్పు అయితే.. ప్రభుత్వ ఆస్తుల్ని అదే పనిగా అమ్మేయటం మోడీ చేస్తున్న పని. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు ఉండవల్లి.