కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు ..విజయవాడ యువతి తండ్రి !

Sat Oct 17 2020 16:00:48 GMT+0530 (IST)

The father of the Vijayawada girl Says that misleading the case!

విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన యువతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. లాక్ డౌన్ సమయంలో భాదిత యువతికి నాగేంద్ర రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే పెళ్లి తర్వాత ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు మూడు నెలల క్రితమే తెలిసింది. దీనితో యువతినికుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. నాగేంద్ర నడవడిక బాలేదని అతను సరైన వ్యక్తి కాదని దివ్యకు చెప్పడంతో నాగేంద్రను యువతి అప్పటినుండి దూరం పెడుతూ వచ్చింది.అయితే హత్య జరగడానికి ముందు రోజు దివ్య ఇంటి వద్ద నాగేంద్ర గొడవ చేశాడు. ఈ క్రమంలో గంజాయి అలవాటు ఉన్న నాగేంద్ర మత్తులో యువతిని హత్యచేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో ఆమె మాట్లాడిన ఒక వీడియో కూడా బయటకి వచ్చింది.

ఆ వీడియోలో తను రెండేళ్ళ క్రితమే రిలేషన్ కి స్వస్తి చెప్పానని తెలిపింది. ఇక వారి మధ్య మాట్లాడిన దివ్య తండ్రి లంచగొండి అని తాను మాత్రం కష్టాన్ని నమ్ముకుని బతికే వాడినన్నాడు. దివ్య అన్నయ్య డ్రగ్స్‌కు బానిసని... అందువల్ల అతనితో కూడా మాట్లాడలేదన్నాడు. ఇక యువతి నాగేంద్ర ఫోన్ కాల్ రికార్డ్ ఒకటి లీకయింది.

ఆ కాల్ రికార్డ్ ప్రకారం పెళ్లి విషయాన్ని దాచ లేక మానసిక సంఘర్షణకి గురువుతున్నా అంటూ నాగేంద్ర కు ఫోన్ చేసింది. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న కూడా నేనుగా ఉండలేక పోతున్నానని ఆమె చెప్పింది. అయితే నిందుతుడు మాత్రం నేను యువతి గొంతు కోయలేదు అని చనిపోవాలని నిర్ణయం తీసుకోని ఎవరి గొంతు వాళ్లమే కోసుకున్నాం అని పోలీసులకి వాగ్మూలం ఇచ్చాడు. అలాగే యువతి కుటుంబ సభ్యులు అసలు మా అమ్మాయి పెళ్లి చేసుకోలేదు అని వారే కావాలని ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. దీనితో ఈ కేసు పోలీసులకి సవాల్ విసురుతుంది. ఈ కేసును బెజవాడ పిఎస్ నుంచి దిశ స్టేషన్ కు బదిలీ చేశారు. తాజాగా యువతి తండ్రి జోసెఫ్ ఈ కేసు పై స్పందించాడు. నాగేంద్ర కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆయన ఆరోపించాడు. తాము ఇంట్లో లేనప్పుడు అదను చూసి తమ కూతురుపై కత్తితో దాడి చేశాడని తమకు న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు.