Begin typing your search above and press return to search.

ఆదిలోనే విఘాతం : బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్ రద్దు!

By:  Tupaki Desk   |   25 Jan 2020 1:55 PM GMT
ఆదిలోనే విఘాతం : బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్ రద్దు!
X
ఆంధప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లుని టీడీపీ మండలిలో అడ్డుకోవడం తో టీడీపీ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారం ఇలా సాగుతున్న సమయంలోనే ఈ నెల 16 న జనసేన , బీజేపీ మధ్య పొత్తు కుదిరినట్టు ప్రకటించడం విశేషం. అలాగే ఇక పై ఏపీలో ఏ సమస్య పై నైనా కూడా జనసేన , బీజేపీ కలిసి పోరాడతాయి అని రెండు పార్టీల నేతలు ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలని.. మూడు రాజధానులకు వ్యతిరేకమని రెండు పార్టీల నేతలు స్పష్టం చేసారు.

ఇకపోతే , పొత్తు కుదిరిన తరువాత హస్తిన టూర్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ పలువురు కేంద్రమంత్రులని కలిశారు. ఆ సమయంలో ఏపీ రాజధానుల సమస్య పై కూడా చర్చించారు. దీనితో అమరావతి రైతులకి అండగా ..ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ , జనసేన కలిసిన తరువాత సంయుక్తంగా మొదటిసారి లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో దీన్ని ఇరు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

అయితే , ఆంధ్రప్రదేశ్‌ లో అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా బీజేపీ , జనసేన సంయుక్తంగా చేపట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఫిబ్రవరి 2న ఆ రెండు పార్టీలు లాంగ్ మార్చ్ చేపట్టాయి. అయితే, ఆ లాంగ్ మార్చ్ వాయిదా పడినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి తురగా నాగభూషణం ప్రకటించారు. ఈ అంశం పై భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. పొత్తు తరువాత రెండు పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించిన తొలి కార్యక్రమం వాయిదా పడటానికి అసలు కారణం ఏంటనే దాని పైన స్పష్టత ఇవ్వేలేదు. అయితే , లాంగ్ మార్చ్ వాయిదా పడినట్టు బీజేపీ ప్రకటించినా కూడా జనసేన నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే, లాంగ్ మార్చ్ వాయిదా పడడానికి కారణం ఏంటి? నేదాని పై అందరూ ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.