విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ..

Thu Aug 16 2018 14:20:05 GMT+0530 (India Standard Time)

Vijay Mallya Will Have To Pay Rs 1.5cr More For Banks Legal

భారతదేశంలోని బ్యాంకులకు దాదాపు 9వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం విజయ్ మాల్యాపై భారతీయ బ్యాంకుల కన్సోర్టియం లండన్ కోర్టులో పిటీషన్ వేసింది. ప్రస్తుతం భారత్ కు మాల్యాను అప్పగించాలన్న ప్రక్రియపై వాదనలు నడుస్తున్నాయి. అయితే తాజాగా  భారతీయ బ్యాంకులకు లీగల్ ఫీజుల కింద రూ.1.5కోట్లను చెల్లించాలని లండన్ హైకోర్టు మాల్యాను ఆదేశించింది.  బ్యాంకులకు వ్యతిరేకంగా మాల్యా వేసిన కొట్టివేసిన కోర్టు బ్యాంకుల లీగల్ ఫీజులను మాల్యానే చెల్లించాలని తీర్పునిచ్చింది.ఇప్పటివరకూ బ్యాంకుల న్యాయ ఖర్చుల కోసం మాల్యా రూ.1.8 కోట్లు చెల్లించారు.  మరో 60 రోజులలోపు  1.75 లక్షల పౌండ్లు (1.5కోట్లు) చెల్లించాలని.. అనంతరం తుది పరిష్కారం.. సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని లండన్ కోర్టు జడ్జి తెలిపారు.

గడిచిన వారమే మాల్యా బ్యాంకులతో రాజీ కుదుర్చుకుంటానని కోర్టుకు తెలిపారు. తనకు భారత్ లో ఉన్న ఆస్తులను అమ్మితే 10వేల కోట్లకు పైగా వస్తాయని.. బ్యాంకుల అప్పులు 9వేల కోట్లు కడుతానని చెప్పాడు. దీనిపై విచారించిన కోర్టు భారత్ కు అప్పగించే విషయంలో తుది విచారణను త్వరలో చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కోర్టు బ్యాంకుల న్యాయ ఖర్చులను ఇచ్చేయాలని మాల్యాను ఆదేశించడం విశేషం.