వీడియో : వార్నర్ ఈసారి చిరు అయ్యాడు

Fri May 13 2022 15:02:59 GMT+0530 (India Standard Time)

Video: Warner Became Chiru this time

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడటంతో పాటు సోషల్ మీడియాలో పలు తెలుగు సినిమాలకు సంబంధించిన ఫేమస్ డైలాగ్స్ ను మరియు పాటలను మరింత ఫేమస్ అయ్యేలా ఇన్ స్టా గ్రామ్ లో వీడియోలు చేసి ఆకట్టుకున్నాడు. డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా లో ఒక సెన్షేషన్.అలాంటి డేవిడ్ వార్నర్ ఇప్పటికే అల్లు అర్జున్.. మహేష్ బాబు ఇంకా కొందరిని అనుకరిస్తూ చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్నా కూడా డేవిడ్ వార్నర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఫేస్ ను మార్ఫ్ చేసి తన ఫేస్ ను పెట్టి వీడియోను షేర్ చేసి అందరిని ఆకర్షించాడు.

రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ సినిమా లో చిరంజీవి క్లైమాక్స్ లో కొద్ది సమయం కనిపిస్తాడు.

ఆ సమయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఆయన స్టైల్ ను మెగా అభిమానులు అంత సులువుగా మర్చిపోరు. అలాంటి చిరు వీడియోను వార్నర్ మార్ఫ్ చేసి తనకు అనుకూలంగా మార్చుకుని సోషల్ మీడియాలో సందడి చేశాడు.

బ్రూస్ లీ సినిమాలోని ఆ వీడియోను వార్నర్ చేయడంతో మెగా అభిమానులు తెగ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక వార్నర్ గతంలోనే పుష్ప పలు వీడియోలను చేయడం వల్ల మెగా అభిమానులు ఆయన్ను అభిమానిస్తూ ఉన్నారు. అల వైకుంఠపురంలో మరియు పుష్ప స్థాయిని ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడం లో ఆయన సఫలం అయ్యాడు అనేది టాక్.

ఇక ఆయన ఆట విషయానికి వస్తే గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఆడిన సమయంలో కాస్త ఫామ్ కోల్పోయాడు. దాంతో ఆయన్ను హైదరాబాద్ వదులుకుంది. ఇప్పుడు ఆయన కొత్త జట్టులో అడుగు పెట్టి వీర బాధుడు బాదుతూ కుమ్మేస్తున్నాడు. ఐపీఎల్ లో ఎన్నో విజయాలను అందించిన వార్నర్ ను వదులుకోవడం పట్ల హైదరాబాద్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.