Begin typing your search above and press return to search.

అతి త్వరలో రోజులో 12 గంటల పని

By:  Tupaki Desk   |   23 Nov 2020 12:30 AM GMT
అతి త్వరలో రోజులో 12 గంటల పని
X
మన దేశంలో ఇప్పటివరకు కార్మికులు రోజుకి 8 గంటలు మాత్రమే పని చేస్తారు. ఆలా మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. అయితే , తాజాగా కేంద్ర కార్మిక శాఖ రోజుకు 12 పని గంటలు ఉండాలనే ప్రతిపాదన తెచ్చింది. అయితే, వారానికి మాత్రం 48 గంటలే పని ఉండాలనీ, ఒక వీకాఫ్ ఉండాలని కోరింది. ప్రస్తుతం రోజుకు 8 గంటల చొప్పున, ఆరు రోజుల్లో 48 పని గంటలు ఉంటాయి. కొత్త ప్రతిపాదన కూడా ఇదే విధంగా ఉన్నా, రోజుకు 12 గంటల పని ఉండాలన్న మార్పు కొత్తగా తెచ్చినది. నవంబర్ 19న ఈ డ్రాఫ్ట్ రూల్స్ రెడీ చేసింది కార్మిక శాఖ. నిజానికి రోజుకు 12 గంటల పనిలో మధ్యమధ్యలో విశ్రాంతి ఇవ్వాలంటూ రూపొందించిన, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింక్ కండీషన్స్ కోడ్ 2020ని ఈ ఏడాది ఆరంభంలో పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

అయితే , ఇది అమల్లోకి రాలేదు. దీనికి కారణం... వారంలో పని గంటలు 48 గంటలే ఉండాలనడమే. అలా కాకుండా రోజుకు 12 పని గంటలు ఉంటే, నాలుగు రోజుల్లో 48 గంటలు పూర్తవుతాయి. మిగతా 3 రోజులు వీకాఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే , ఇది కుదరక పోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. వారానికి 48 గంటల కండీషన్ ఉంది కాబట్టి, ప్రస్తుతం అమలుచేస్తున్న రోజుకు 8 గంటల పనినే అమల్లో ఉంచారు. దేశంలో వాతావరణ పరిస్థితులను లెక్కలోకి తీసుకొనే ఈ ప్రతిపాదన తెచ్చారు. దీని వల్ల వర్కర్లకు ఓవర్ టైమ్ మనీ లభిస్తుంది" అని కార్మిక శాఖలోని ఓ సీనియర్ తెలిపారు. డ్రాఫ్ట్ రూల్స్‌లో మేం కావాల్సిన మార్పులు చేస్తాం. తద్వారా... వర్కర్లు రోజుకు 8 గంటలకు మించి పని చేసి... ఓవర్ టైమ్ ప్రయోజనాలు పొందేలా చేస్తాం అని ఆయన వివరించారు.