Begin typing your search above and press return to search.

కొంపముంచిన కూరగాయల వ్యాపారి....26మందికి వైరస్ !

By:  Tupaki Desk   |   2 Jun 2020 2:00 PM GMT
కొంపముంచిన కూరగాయల వ్యాపారి....26మందికి వైరస్ !
X
గుంటూరు జిల్లాలో వైరస్ పంజా విసురుతోంది. గోరంట్లలో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తర్వాత మార్కెట్ ‌లో వైరస్ పరీక్షలు నిర్వహిస్తే మరో 18మందికి వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఈ వ్యాపారి వల్ల మొత్తం 26మందికి వైరస్ సోకింది అని తేలగా అతడి కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆ వ్యాపారి ఉంటున్న ప్రాంతాల్లో శానిటైజేషన్ చేశారు. మరికొంతమందికి పరీక్షలు నిర్వహించే పనిలో ఉన్నారు. అనుమానితుల్ని క్వారంటైన్‌కు తరలించే పనిలో ఉన్నారు.

ఇక మిగిలిన జిల్లాల్లో కూడా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 12,613 శాంపిల్స్‌ను పరీక్షించగా 82 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇతర కేసులు 33 ఉన్నాయి. మొత్తం కలిపితే 115 నమోదయ్యాయి.

తాజాగా నమోదు అయిన కేసులు కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3200కు చేరాయి. మరో 40మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 927కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2209మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ తో మొత్తం 64మంది చనిపోయారు.