Begin typing your search above and press return to search.
రంగా జయంతి వేళ కాక పుట్టిస్తున్న రాజకీయం
By: Tupaki Desk | 4 July 2023 2:44 AM ISTవంగవీటి మోహన రంగా. కాపులకు ఆరాధ్యనీయుడు. ఆయన ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ లో ఉండేవారు. 1988 డిసెంబర్ 26న రంగా హత్య జరిగింది. ఇప్పటికి 35 ఏళ్ళు గడచినా రంగా పేరు మాత్రం ఏపీలో మారుమోగుతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికల వేళ రంగా పేరు తలచుకుంటూ రాజకీయ పార్టీలు ఆయనను తమ వాడిగా చెప్పుకునేందుకు ఆరాటపడుతూంటాయి.
రంగా జయంత్రి జూలై 4. ఆ రోజున ఏపీలో పలు చోట్ల కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. టీడీపీ జనసేనతో పాటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున రంగా జయంతిని ఎక్కడికక్కడ నిర్వహిస్తోంది ఇక బీజేపీ కూడా రంగాను తలచుకుంతోంది.
వైసీపీ నాయకత్వంలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రంగా జయంతి వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వంగవీటి రంగా జయంతి ఈసారి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికలు ఏపీలో మరో ఏడాది కూడా వ్యవధిలో లేవు. ఈసారి ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మకమైన భూమికను పోషించనున్నారు.
కాపులు దాదాపుగా యాభై నుంచి అరవై నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు అని చెబుతారు. దాంతో ఏపీలో అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లే కీలకం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక జనసేన తమకు అన్ని కులాలు సమానమే అని చెబుతున్నా కాపులు ఆ పార్టీని దదాపుగా ఓన్ చేసుకున్నారు అని టాక్ ఉంది. ఇంకో వైపు కాపులు ఈసారి రాజ్యాధికారాన్ని చేపట్టాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది.
ఎపుడూ ఒకటి రెండు కులాలేనా మిగిలిన వారికి కూడా అవకాశం దక్కాలన్నది కూడా ఉంది. దాంతో కాపులు ఈసారి తమ రాజకీయ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి తగిన కార్యాచరణతో ముందుకు వస్తారని అంటున్నారు. కాపుల ఓట్లను జనసేన వైపుగా మళ్ళించాలని ప్రయత్నం కూడా జరుగుతోంది అని అంటున్నారు.
అదే టైం లో కాపుల ఓట్లలో తమ వాటాను కూడా చూసుకునేందుకు వైసీపీ టీడీపీ తమ వంతుగా రాజకీయాలను చేస్తున్నాయని అని అంటున్నారు ఇక వంగవీటి రంగా జయంతి వేళ కాపు నాయకుల నుంచి సంచలన ప్రకటన ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. గత ఏడాది అయితే కొందరు టీడీపీ మాజీ మంత్రులు కూడా జయంతి వేడుకలలో పాల్గొని ఈసారి కాపులకే సీఎం పదవి అని సౌండ్ చేశారు.
అలా మాట్లాడిన వారిలో ముఖ్యుడిగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో ప్రస్తుతం చురుకైన పాత్ర పోషిస్తున్నరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, చంద్రబబు సీఎం అవుతారని ఆయన అంటున్నారు. మరి కాపులలంతా వరస మీటింగ్స్ పెట్టుకున్నారు. అందులో పాల్గొన్న వారు ఇపుడు ఇతర పార్టీలలో కనిపిస్తున్నారు. కన్నా లక్ష్మీ నారాయణ సైతం టీడీపీలోనే ఉన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే కాపులు గుత్తమొత్తంగా మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయం ఇంకా చెప్పడం లేదు, విడిగానో పొత్తులతోనో అని వారాహి యాత్ర వేళ సస్పెన్స్ పెట్టేశారు. పొత్తులతో అయితే మాత్రం కాపుల ఆకాన్షలు నెరవేరవనే చెప్పాలి. అయితే రంగా జయంతి సాక్షిగా కాపులు తమ మనసులో మాటను మరో మారు చెప్పి దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే రంగా జయంతి వేళ ఏపీ రాజకీయం కాక పుట్టించే అవకాశం ఉంది అని అంటున్నారు.