Begin typing your search above and press return to search.

పాజిటివ్ అయితే 8 వారాలు టీకా అవసరంలేదు .. ఎవరు చెప్పారంటే ?

By:  Tupaki Desk   |   22 April 2021 8:30 AM GMT
పాజిటివ్ అయితే 8 వారాలు టీకా అవసరంలేదు .. ఎవరు చెప్పారంటే ?
X
కరోనా .. కరోనా ప్రస్తుతం ఈ పేరు తప్ప మరో పేరు , దీని గురించి చర్చ తప్ప మరో దాని గురించి చర్చ అసలు లేదు. కరోనా దెబ్బకి జీవితం మారిపోయింది. అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. రోజులో ఒక్కసారి కూడా చేతులు కడిగే అలవాటు లేని వారు సైతం , కరోనా దెబ్బకి ఎన్నో సార్లు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వాలకి ప్రజల ను కరోనా భారీ నుండి ఎలా కాపాడాలో తెలియక అనేక సతమతమౌతున్నారు. లాక్ డౌన్ వేస్తే ఆర్థిక భారం .. వేయకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే , కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది కదా అంటే .. ఆ వ్యాక్సిన్ ను ఎప్పుడు వేయించుకోవాలి , ఎవరు వేయించుకోవాలి , ఎవరు వేయించుకోకూడదు అని ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నప్పటి కూడా ప్రజల్లో ఇంకా అయోమయం తొలగిపోలేదు. కొందరు వ్యాక్సిన్ అంటేనే ఆమడదూరం పేరుగెత్తుతున్నారు. మరికొందరు ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలో తెలియక తికమకపడుతున్నారు.

ఇదిలాఉంటే .. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చి , తగ్గిపోయిన వారిలో టీకా పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాజిటివ్ వచ్చి పోయింది కదా మేము అసలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా , లేదా అసలు వ్యాక్సిన్ తీసుకోకూడదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా కొందరు వైద్య నిపుణులు స్పందించారు. పాజిటివ్‌ అయిన వారు వ్యాక్సిన్‌ కోసం తొందర పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.అలాగే , మరికొంతమంది తొలి డోసు వ్యాక్సిన్‌ తర్వాత పాజిటివ్‌ అయ్యారు. వీళ్లు కూడా రెండో డోసు వేయించుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. పాజిటివ్‌ నుంచి కోలుకున్నాక కనీసం 8 వారాల వరకూ వ్యాక్సిన్‌ అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకోగానే శరీరంలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయి ఉంటాయని, ఈ దశలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదని, మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. పలు దేశాల్లో కరోనా పాజిటివ్‌ తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్‌ వేయించుకోవాలా అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. కానీ అమెరికాలోని సెంట్రల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సంస్థ (సీడీసీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకూ వ్యాక్సిన్‌ అవసరం లేదని, ఆ తర్వాత వేయించుకోవాలని సూచించాయి. కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్నామంటేనే మనలో యాంటీబాడీస్‌ ఉన్నట్టు లెక్క. మూడు మాసాలు మళ్లీ కరోనా వచ్చే అవకాశం తక్కువే. ఆ తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు.