వీవీఎస్ లక్ష్మణ్ ను లైట్ తీసుకున్న బ్యాంకు

Wed Oct 16 2019 16:47:58 GMT+0530 (IST)

భారత దిగ్గజ క్రికెటర్ గా పేరుపొందిన వీవీఎస్ లక్ష్మణ్  బ్యాంకు నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించినా సదురు బ్యాంకు ఇప్పటివరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది..ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉండే వీవీఎస్ ఆవేశ పడిన సందర్భాలు చాలా తక్కువ. ఇక వివాదాలకు.. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. అలాంటి వీవీఎస్ లక్ష్మణ్ ఒక్కసారిగా ఆగ్రవేశాలకు లోనయ్యాడు. ఆ బ్యాంకుపై ట్విట్టర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.. అయితే బ్యాంకు పై వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ దుమారం రేపింది. దేశవ్యాప్తంగా అందరి నోళ్లలోనూ నానింది..ఇండస్ ఇండ్ బ్యాంకు సేవలు కస్టమర్ కేర్ దారుణంగా ఉందంటూ వీవీఎస్ లక్ష్మణ్ తన ఆవేదనను ట్విట్టర్ లో వెళ్లగక్కాడు. బ్యాంకు సేవలతో తాను నిరాశ చెందానని వాపోయాడు. ఆ బ్యాంకు సిబ్బందే వచ్చి తనను ఖాతా ప్రారంభించాలని కోరారని.. తీరా తీశాక ఇప్పుడు సేవలను అందించడంలో కనీస చొరవ చూపడం లేదని వీవీఎస్ మండిపడ్డారు.

అయితే ఇండస్ ఇండ్ బ్యాంకు చేసిన పొరపాటు ఏంటో వీవీఎస్ తెలుపలేదు. సేవలను అందిస్తానని చెప్పి మరిచిన ఇండస్ ఇండ్ బ్యాంకు కూడా వీవీఎస్  ఇంత సీరియస్ గా వ్యాఖ్యానాలు చేసినా.. పరువు పోయినా వాటికి కౌంటర్ కానీ.. వివరణ కానీ ఇవ్వకపోవడం గమనార్హం. వీరిమధ్య వివాదం ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది.