Begin typing your search above and press return to search.

టీపీసీసీ చీఫ్ ప్రకటనపై కాంగ్రెస్ లో చిచ్చు

By:  Tupaki Desk   |   9 Jun 2021 4:30 PM GMT
టీపీసీసీ చీఫ్ ప్రకటనపై కాంగ్రెస్ లో చిచ్చు
X
టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటనకు ముందే కాంగ్రెస్ లో చిచ్చు రేగింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖాయమైందన్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్లు ఈ నియామకంపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇప్పుడు చిచ్చు రేపుతున్నాడు.

పీసీసీ చీఫ్ నియామకంపై ప్రకటనకు ముందే సీనియర్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాగూర్ కు వీహెచ్ లేఖ రాయడం సంచలనమైంది.

2014 నుంచి ఇప్పటివరకు పార్టీ అంతర్గత సమీక్ష జరగలేదని వీహెచ్ తెలిపారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఓడిపోతే కూడా రివ్యూ చేయలేదన్నారు. కేరళలో కాంగ్రెస్ ఓడిపోతే వెంటనే పీసీసీ సహా కార్యవర్గాన్ని మార్చారని.. తెలంగాణలో పార్టీ 2014 నుంచి ఓడిపోతున్నా ఎందుకు ప్రక్షాళన చేయడం లేదని వీహెచ్ విమర్శలు గుప్పించారు.

పార్టీకి బీసీలు దూరం అవుతున్నారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పీసీసీ చీఫ్ విషయంలో అందరి అభిప్రాయలు తీసుకోవాలని వీహెచ్ అధిష్టానానికి సూచించారు.పార్టీలో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని ముందుకెళ్లాలని వీహెచ్ సూచించారు. సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడినైన తననే నోటికొచ్చినట్టు దుర్భాషలాడితే స్పందించే నాథుడే లేరని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.