Begin typing your search above and press return to search.

తెలంగాణ అసెంబ్లీ రద్దు.. రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ అంచనాలు పీక్స్

By:  Tupaki Desk   |   6 Feb 2023 6:00 PM GMT
తెలంగాణ అసెంబ్లీ రద్దు.. రాష్ట్రపతి పాలన.. ఉత్తమ్ అంచనాలు పీక్స్
X
నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశలు పీక్స్ కు చేరాయి. ఆయన అంచనాలు ఇప్పుడు ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబోతున్నారని.. రాష్ట్రపతి పాలన వస్తోందని జోస్యం చెబుతున్నారు. అది రావాలని కేసీఆర్ దిగిపోవాలని కలలుగంటున్నారు.

ఈ మేరకు కేంద్రాన్ని కోరడానికి ఉత్తమ్ రెడీ అయ్యారట.. రాష్ట్రపతి పాలనలోనే ముందస్తు ఎన్నికలు జరపాలని ఉత్తమ్ డిమాండ్ మొదలుపెట్టారు. ఈ మేరకు సూర్యపేట జిల్లా కోదాడలో జరిగిన సమావేశంలో పంతం పట్టారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుందని అంటున్నాడు.

తెలంగాణలో సామరస్యంగా ఎన్నికలు జరిగే పరిస్తితి లేదని ఉత్తమ్ అంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార బీఆర్ఎస్ కు తొత్తులుగా మారారని ఉత్తమ్ అభిప్రాయపడుతున్నారు.

దళితబంధులో అవకతవకలు జరగకుండా పాదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. దళితబంధు గురించి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. ఇందులో ఎమ్మెల్యేల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేసిందన్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇందులో పాలుపంచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులందరికీ ఈ పథకం అమలు చేయాలన్నారు.

దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తోందని.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ప్రపంచ చరిత్రలో అరుదైన గొప్పయాత్ర అని ఉత్తమ్ కొనియాడారు. రాహుల్ గాంధీతో కలిసి తాను ఏపీ, తెలంగాణలో 450 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు. దేశాన్ని బీజేపీ మతపరంగా చిన్నాభిన్నం చేసిందన్నారు.

కాగా ఉత్తమ్ అంచనాల ప్రకారం కేసీఆర్ ముందస్తుకు వెళతారని భావిస్తున్నారు. అలా వెళితే రాష్ట్రపతి పాలన పెట్టి మొత్తం వ్యవస్థను మార్చేసి బీజేపీ ఇక్కడ పటిష్టంగా ఎన్నికలు నిర్వహించాలని ఉత్తమ్ కోరడానికి రెడీ అయ్యారు.అయితే బీజేపీతో సఖ్యత లేని ఈ దశలో కేసీఆర్ అలాంటి సాహసానికి వెళ్లడం కష్టమేనని చెప్పకతప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.