కడప అడ్డా.. తీరు మారదు గురూ.. ఏం జరుగుతోందంటే!

Fri Oct 07 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Update on Kadapa Politics

ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మున్సిపల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశా లను బేఖాతర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'పట్టభద్రుల వివరాలు సేకరించండి' అంటూ వలంటీర్లకు టెలి కాన్ఫరెన్స్‌లో హుకుం జారీ చేయడం ఇప్పుడు సమస్యకు దారితీసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.అయితే.. ఈ నెల 1 నుంచి ఓటు నమోదుకు పట్టభద్రులకు ఈసీ అవకాశం కల్పించింది. కడప కర్నూలు అనంతపురం స్థానానికి టీడీపీ నుంచి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పులివెందులకు చెందిన భూమిరెడ్డి రాంగోపా ల్‌రెడ్డి వైసీపీ నుంచి వెన్నపూస రవీంద్రనాథరెడ్డి మరికొందరు పోటీలో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే సాక్షా త్తు పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓ అధికారి టెలి కాన్ఫరెన్స్‌లో... 'మీ పరి ధిలో ఉండే పట్టభద్రుల వివరాలు సేకరించి వారికి ఓటు హక్కు కల్పించండి. ఆ వివరాలన్నీ అందజేయం డి' అని చెప్పడం చర్చ నీయాంశంగా మారింది.

ఎన్నికల కమిషన్ వలంటీర్ల ప్రమేయం వద్దంటూ ఇప్పటికే విస్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఏ మాత్రం లెక్కచేయకుండా అధికారి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది.

దీనిపై టీడీపీ నేత భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 'మీకు రాజకీయాలంటే అంత ఇష్టముంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీ యాల్లో చేరండి' అని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నారు. అయినా.. కూడా కడప అడ్డాలో తమకు తిరుగులేదనే రీతిలో అధికారులు వ్యవహరిస్తుం డడం గమనార్హం.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.