ఐక్యరాజ్య సమితి ఏ పరిస్థితుల్లో ఏర్పడింది..? ఏ సంవత్సరంలో ప్రారంభమైంది..?

Sun Oct 24 2021 20:00:01 GMT+0530 (IST)

Under what circumstances was the United Nations formed

ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు  ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఏర్పాటైంది. అంతర్జాతీయంగా చట్టబద్ధత ఆర్థిక సామాజిక అభివృద్ధి మానవ హక్కుల కృషి కోసం ప్రపంచ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఇది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటైన నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధ నివారణలో విఫలం చెందింది. దీంతో 1945 అక్టోబర్ 24న  193 దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. ఐరాసలో ప్రధానంగా 6 అంగాలున్నాయి. ఇందులో ప్రశేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా.. భద్రతా మండలిలో మాత్రం 15 దేశాలకు మాత్రం సభ్యత్వం ఉంటుంది. 10 దేశాలు రెండేళ్లకొకసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందుతాయి.ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది. ప్రస్తుత దీని ప్రధాన కార్యదర్శిగా అంటానియో గుట్టెర్జ్ ఉన్నారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 24న  ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహిస్తారు. యూఎస్ దినోత్సవం సందర్భంగా న్యూయార్క్లోని ప్రధాన కార్యాలయంలో ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ హాల్ లో ఐక్యతకు గుర్తుగా అన్ని దేశాలు కలిసి దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అక్టోబర్ 21న రిపబ్లిక్ ఆప్ కొరియా శాశ్వత మిషన్ స్పాన్సర్ చేసిన బిల్డింగ్ బ్యాక్ టు గెదర్ ఫర్ పీస్ అండ్ ప్రొస్పెరిటీ అనే థీమ్ తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 9141లో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్ వెల్ట్ బ్రిటిష్ ప్రధాని విన్ స్టల్ చర్చిల్ లు కలిసి అట్లాంటిక్ సముద్రంలో ఒక షిప్ లో సమావేశమయ్యారు. ఆ తరువాత శాంతిని నెలకొల్పేందుకు ఎనిమిది అంశాలతో కూడిన ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఐక్యరాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందింది. ఆ తరువాత 1944లో వాషింగ్టన్లో డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా బ్రిటన్ రష్యా ప్రతినిధులు ఐరాస ప్రకటన ముసాయిదాను తయారు చేశారు. 1945 ఎప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్య సమితి చార్టర్ పై సంతకం చేశాయి. ఇదే సంవత్సంర అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి లాంఛనంగా ప్రారంభైంది.

ఐక్యరాజ్య సమితి అనేది దేశాల మధ్య శాంతి భద్రతల మధ్య స్నేహపూర్వ సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అంతర్జాతీయంగా దేశాలన్నింటిని ఒక్క తాటిపైకి తీసకొచ్చి సమన్వయం చేసే కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే అంతర్జాతీయంగా ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకోవడం దేశాల మధ్య తగాదాలను పరిష్కరించడం చేస్తుంది. సాంఘిక అభివృద్ధి సాధించిన మానవ జీవితలను సుఖమయం చేయడమే ఈ సమితి ప్రధాన ఉద్దేశం.

ఐక్యరాజ్య సమతికి కొన్ని అనుబంధ సంస్థలున్నాయి. ఇవి సమతిని సహాయ సహకారాలు అందిస్తాయి. ైక్యరాజ్య సమితి సాంస్కృతిక సంస్థ అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఆహార వ్యవసాయ సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థం ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ శిశ్వ తపాలా యూనివర్సల్ పోస్టల్ యూనియన్ తదితర అనుబంధ సంస్థలున్నాయి.

ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు 5. వాటిలో అమెరికా రష్యా బ్రిటన్ ఇండియా ఫ్రాన్స్. ఐక్యరాజ్య సమితి సింబల్ లో ఉన్నవి సభ్యదేశాల భూభాగాలు. ఇందులో అంటార్కిటికా పశ్చిమ సహారా తైవాన్ లు సభ్య దేశాలు కావు.