Begin typing your search above and press return to search.

కోట్లు మాకో లెక్కా. మా ఆస్థి 200 కోట్లు ఉంది. ఉండ‌వల్లి శ్రీదేవి భ‌ర్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   28 March 2023 2:47 PM
కోట్లు మాకో లెక్కా. మా ఆస్థి 200 కోట్లు ఉంది. ఉండ‌వల్లి శ్రీదేవి భ‌ర్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌ కు పాల్ప‌డి. టీడీపీ నుంచి 10 నుంచి 20 కోట్ల రూపాయ‌లు తీసుకున్నారని ఆరోపిస్తూ. వైసీపీ సస్పెన్ష‌న్ వేటు వేసిన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వల్లి శ్రీదేవి వ్య‌వ‌హారం . ఇంకా స‌మ‌సిపోలేదు. ఆమెకు వ్య‌తిరేకం గా వైసీపీలోని కొంద‌రు నేత‌లు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో ఆయా ప‌రిణామాల‌ పై శ్రీదేవి భ‌ర్త డాక్ట‌ర్ శ్రీధ‌ర్ హాట్ కామెంట్లు చేశారు.

త‌మ‌కు 200 కోట్ల రూపాయ‌ల ఆస్థులు ఉన్నాయ‌ని.. అలాంటి త‌మ‌కు రూ.10 నుంచి 20 కోట్లు పెద్ద లెక్క కాద‌ని వ్యాఖ్యానించారు. అయినా. ఇచ్చార‌ని అంటున్న‌వారు.. ఏ ఆధారాల‌తో ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారో చెప్పాల‌న్నారు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా. ఇప్పుడు అనేక కేసులు విచారిస్తున్నార‌ని. దీనికి కూడా ఎలాంటి ఆధారాలు ఉన్నా. గూగుల్ టేక్ అవుట్ ద్వారా బ‌య‌ట పెట్టాల‌ని అన్నారు. తాను డాక్ట‌ర్‌ గా సంపాయించుకున్న డ‌బ్బుతోనే 2016లో ఆస్తులు కొనుగోలు చేసిన‌ట్టుచెప్పారు.

ప్ర‌స్తుతం ఉన్న విల్లా కూడా 75 కోట్లు ఉంటుంద‌ని. దీనికి సంబంధించి అప్పులు కూడా. డాక్ట‌ర్‌ గా సంపాయిస్తున్న సొమ్ముతోనే నెల‌నెలా ఈఎంఐలు క‌ట్టుకుని పూర్తిచేస్తున్న‌ట్టు చెప్పారు. వైసీపీ పెయిడ్, పేటీఎం బ్యాచ్‌. ఇలాంటి ఆరోప‌ణ‌లు క‌ట్టిపెట్టాల‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే గా ఉంటూ కూడా. త‌న నుంచి ఉండ‌వ‌ల్లి డ‌బ్బులు తీసుకుని రోజు వారీ ఖ‌ర్చులు పెట్టుకుంద‌ని తెలిపారు. త‌మ‌కు ఎవ‌రికో అమ్ముడు పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

స‌మాజంలో ఒక స్థాయిలో ఉన్నామ‌ని. చిల్ల‌ర ప‌నులు చేసే వ్య‌క్తులం తాము కాద‌ని వ్యాఖ్యానించారు. క్వారీలు, అర‌టి పండ్ల వాళ్ల నుంచి తాము రూపాయి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఏదైనా ఆధారాలు ఉంటే విమ‌ర్శ‌లు చేసేవారు నిరూపించాల‌న్నారు. అస‌లు రాజ‌కీయాల్లో కి ఎందుకు వ‌చ్చామా? అని బాధ‌ప‌డుతున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

మ‌హిళా సాధికార‌త‌కు, వారి ఆత్మ‌గౌర‌వానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. ఇటీవ‌ల ఆస‌రా నిధుల విడుద‌ల సంద‌ర్భంగా కూడా సీఎం జ‌గ‌న్ చెప్పార‌ని.. మ‌రి ఇప్పుడు అదే సొంత పార్టీ ఎమ్మెల్యే మ‌హిళ‌ పై ఇలా వ్యాఖ్య‌లు చేయొచ్చా? ఇదేం మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి లేద‌ని. రోడ్డు కూడా వేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నామ‌ని. ఎమ్మెల్యే గా అనేక సంద‌ర్భాల్లో శ్రీదేవి చెప్పుకొనేవార‌ని తెలిపారు. ఇప్ప‌టికైనా ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు స్వ‌స్థి ప‌ల‌కాల‌ని చిల్లర‌నేత‌లు త‌మ నోటిని అదుపులో పెట్టుకోవాల‌ని ఆయ‌న ఘాటుగా వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.