Begin typing your search above and press return to search.
చిన్న కోడలుతో మామ ఎఫైర్.. చంపిన భార్య, పెద్ద కోడలు
By: Tupaki Desk | 14 Dec 2020 11:30 AM ISTసభ్యసమాజం ఎటువైపు పోతుందో అర్థం కానీ పరిస్థితి. వావి వరసలు మరిచిపోయి కామా తురాణం నభయం.. నలజ్జ అన్నట్టుగా కామం ముందు బంధాలకు విలువలేకుండా పోతోంది. విచక్షణ మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకొని అవి గొడవలు, హత్యలకు దారితీస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బదోహి జిల్లాలో చిన్నకోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను పెద్ద కోడలితో ఆయన భార్య దారుణంగా గొంతు కోసి చంపేసింది.కోడలితో శృంగారం చేస్తున్న మామను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చంపారు.
కోయిరానా గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి నలుగురు కుమారులు. వీరిలో ఇద్దరికీ కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ ముంబైలో కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న కోడలితో మామకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన భార్య, పెద్ద కోడలు ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన మామ.. భార్యను, పెద్దకోడలుపై దాడి చేశాడు.
ఐదురోజుల కిందటే పుట్టింటికి వెళ్లిన చిన్న కోడలను తన ఇంటికి మామ రప్పించుకున్నాడు. శనివారం రాత్రి ఆమెతో కలిసి రాసలీలలు చేస్తుండగా ఆ ఇంటికి వచ్చిన భార్య, పెద్ద కోడలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చాకుతో గొంతుకోసి హత్య చేశారు. భయంతో పరుగులు తీసిన చిన్న కోడలు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు రాగా మామ చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. అత్త, కోడలుపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.