భారత్ 'నాటో' 'నాటో' అంటున్న అమెరికా

Sat Apr 01 2023 15:34:57 GMT+0530 (India Standard Time)

USA Says Nato Nato to India

'నాటు.. నాటు.. వీర నాటు..' అంటూ 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని పాట ఏడాదినుంచి భారత దేశాన్ని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి సారథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అద్భుత నాట్య నైపుణ్యంతో పిక్చరైజ్ అయిన ఈ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ను కూడా సాధించింది. అయితే..ప్రపంచవ్యాప్తంగానూ



పాపులర్ అయిన 'నాటు నాటు' పాట చివరకు..ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో 'నాటో.. నాటో'గా పేరడీ అయింది. పాశ్చాత్య దేశాల సైనిక కూటమి.. నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ (నాటో) అంటేనే విరుచుకుపడే రష్యా అధ్యక్షుడు పుతిన్ ను వెటకారం చేస్తూ 'నాటు నాటు పాటను నాటో నాటో'గా ప్రచారం చేయడం గమనార్హం.

ఆ కూటమి అంటే మంటలే..

నాటో అంటే సైనిక కూటమి. 15 పైగా దేశాలతో కూడిన ఈ కూటమిది మొదటినుంచీ వివాదాస్పద పాత్రే. అఫ్గానిస్థాన్ ఇరాక్ యుద్ధాల్లో నాటో సైన్యం పాల్గొంది. ఇంకా అనేక సంక్షోభ సమయాల్లోనూ పాల్గొంది. అయితే నాటో అంటే నిప్పులు చెరుగుతాయి కొన్ని దేశాలు. ముఖ్యంగా ఇరాన్ రష్యా. అసలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం మూల కారణమే ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకోవడం. 14 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలానూ లేదు. మరోవైపు రష్యా భయంతో స్కాండినేవియన్ దేశాలు స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో చేరాతమంటూ  రుకులుపెడుతున్నాయి. ఒక్కసారి నాటో సభ్యులు అయితే ఆ దేశంలో నాటో సైన్యం తిష్టవేస్తుంది. నాటో సభ్య దేశంపై ఏ ఇతర దేశమైనా దాడి చేస్తే నాటో సైన్యం ఆ దేశం తరఫున పోరాడుతుంది. అందుకే ఉక్రెయిన్ పై దాడి చేసి రష్యా తన ఉద్దేశం ఏమిటో చెప్పింది.

మన దేశానికీ చాన్సుందా?

నాటో అంటే ప్రత్యేకంగా పశ్చిమ దేశాల సైనిక కూటమి. దీంట్లో ఆసియా దేశాలు లేవు. అయితే భారత్ వంటి సైనికంగా బలమైన దేశం నాటో లో చేరుతుందా? అంటే అవకాశం లేదు అని చెప్పొచ్చు. ఈ విషయంలో.. భారత్తో సంబంధాల కోసం నాటో తలుపులు తెరిచే ఉంచిందని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ అన్నారు. భారత్తో సాన్నిహిత్యంగా ఉండడ తమకు చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు. అంతేకాక భారత్ కోరుకుంటే ఏ సమయంలోనైనా దీని గురించి చర్చిండానికి నాటో సిద్ధంగా ఉందని చెప్పారు. ఒకరకంగా నాటోలో భారత్ చేరేలా అమెరికా ప్రత్యక్ష సంకేతాలిస్తున్నట్లుంది. ఈ మేరకు రెండు దేశాల మధ్య భాగస్వామ్యం అత్యంత దృఢంగా ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాలు ప్రజాస్వామ్యం నియమాల ఆధారిత క్రమం వాతావరణ మార్పు హై బ్రిడ్ బెదిరింపులు సైబర్ భద్రత సాంకేతికత విఘాతం కలిగించడం తదితర అంశాలపై కలిసి పనిచేయడంపై నిమగ్నమయ్యాయని అన్నారు.

వాస్తవానికి సోవియట్ యూనియన్ కోసం ఏర్పడింది నాటో. తొలిసారి ఇండో పసిఫిక్తో తన విస్తరణను పెంచుకుంది. చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించింది.

ఆయా ప్రాంతాలలోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాలతో పాటు ముఖ్యంగా చైనా దూకుడుకు సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తుంది. కాగా నాలుగు ఇడో పసిఫిక్ దేశాలు జపాన్ దక్షిణకొరియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లిథువేనియాలో జరగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందిందని స్మిత్ చెప్పారు. మొత్తం మీద నాటో ఏ ఇండో పసిఫిక్  దేశంతోనూ పొత్తుల పెట్టుకునే యోచన చేయడం లేదని పైగా విస్తృత కూటమిగా విస్తరించే ఆలోచన కూడా లేదని కూడా స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక్క రోజులో యుద్ధాన్ని ముగించగలరని అన్నారు. పశ్చిమ దేశాలుఉక్రెయిన్ కు అవసరమైన వాటిని అందించడమే కాకుండా భవిష్యత్తులో రష్యన్లుచేసిన పనిని ఇతర దేశాలు చేసే ప్రమాదం ఉందని స్మిత్ హెచ్చరించారు. యుద్ధంలో ఉక్రెయిన్కి భారత్ అందించిన మానవతా సాయాన్ని నాటో ప్రశంసించింది. యుద్ధాన్ని ముగించాలని పిలుపునివ్వడమే గాక ఇతర దేశాల ఐక్యరాజ్య సమితి నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ఏదీఏమైనా ఈ ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని స్మిత్ అన్నారు. ఈ యుద్ధంలో రష్యా గనుక అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. దీని గురించి నాటో నిఘా ఉంచినట్లు కూడా యూఎస్ నాటో ప్రతినిధి స్మిత్ వెల్లడించారు.