Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : తుపాకులు భారీగా కొనుగోలు చేస్తున్న అమెరికన్లు!

By:  Tupaki Desk   |   5 April 2020 2:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : తుపాకులు భారీగా కొనుగోలు చేస్తున్న అమెరికన్లు!
X
కరోనావైరస్ తో అమెరికా ప్రస్తుతం గజగజవణికిపోతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కరోనా భారిన పడుతుంది అమెరికాలోనే కావడం గమనార్హం. అమెరికాలో కరోనా భాదితుల సంఖ్య 3 లక్షలకి చేరువలో ఉంది. అయితే , అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుంటే ..మరోవైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా అమెరికన్లు తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగానే అమెరికాలో నల్లజాతీయలు అంటే.. శ్వేత జాతీయులకు పట్టదు. కరోనా వైరస్ వణికిస్తోన్న క్రమంలో తుపాకీలు కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కానీ కారణం అది కాదని - మరొ రీజన్ ఉంది అని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ చెబుతోంది. మార్చి నెలలో గన్ షాపులను ఎక్కువమంది అమెరికన్లు సందర్శించారు. గతంలో ఎన్నడూ ఇంతమంది తుపాకుల కొనుగోలు కోసం రాలేదని ఎఫ్‌ బీఐ తెలిపింది. తుపాకీ కొనుగోలు కోసం దరఖాస్తులు పెరగడంతో 2.4 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. గత ఏడాది మార్చి నెల కన్నా, ఈ ఏడాది 80 శాతం తుపాకుల కొనుగోలు కోసం ముందుకొచ్చారని - ఇంత పెద్దమొత్తంలో ప్రజలు రావడంతో మార్చి 16 నుంచి నెలాఖరు వరకు 1.2 మిలియన్ల మంది నేపథ్యాన్ని చెక్ చేశామని వివరించారు.

ఒకసారి తుపాకీ కోసం దరఖాస్తు చేసుకున్నాక.. ఎఫ్‌ బీఐ చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చాక గన్ డీలర్లు వారి ఆర్డర్ మేరకు తుపాకులను అందజేస్తారు. ఒకసారి వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయడంతో మరిన్ని గన్స్ తీసుకోవచ్చు. కానీ వారు మొత్తం ఎన్ని కొనుగోలు చేశారనే అంశంపై మాత్రం వారి వద్ద ఒక స్పష్టమైన రిపోర్ట్ ఉండదు. అయితే గతనెలలో ప్రైవేట్ డీలర్ల నుంచి ఎన్ని తుపాకులు కొనుగోలు చేశారనే అంశాన్ని మాత్రం ఎఫ్ ఐ బీ ట్రాక్ చేస్తుంది. అయితే , అమెరికా లో తుపాకులు కొనుగోలు చేయడం ఫ్యాషన్ కాదు ..కేవలం వారి భద్రత కోసమే కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ తెలిపింది. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో తుపాకులు కొనుగోలు చేస్తున్నారనే అంశాన్ని కొట్టిపారేసింది. అదేం లేదని - వ్యక్తిగత భద్రత కోసమేనని తెలిపింది.