Begin typing your search above and press return to search.
భారత్ పై యూఎస్ ప్రతినిధి ప్రశంసల జల్లు... కారణం ఇదే!
By: Tupaki Desk | 6 Jun 2023 8:11 PMఏ దేశమేగినా ఎందు కాలెడినా... ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతి ని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అని రాయప్రోలు సుబ్బారావు తన భారత భూమి గురించి కవిత్వం రాసిన సంగతి తెలిసిందే. అలాంటి భారత దేశ ప్రజాస్వామ్యానికి అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం నుంచి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. మన దేశం చైతన్యవంత మైన దేశమని యూఎస్ఏ శ్వేత సౌధం జాతీయ భద్రత సలహా మండలి సమన్వయకర్త జాన్ కెర్చి అన్నాడు.
కావాలంటే ఎవరైనా న్యూఢిల్లీ వెళ్లి ఈ విషయాన్ని తెలుసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలన్నీ ఓ ప్రెస్ మీట్ లో భారతదేశం గురించి గొప్పగా చెప్పాడు. ప్రపంచం లో ఎవరితో నైనా ఆందోళనకర మైన విషయాలు ఉంటే వెల్లడించడానికి తాము సిగ్గుపడము అని చెప్పుకొచ్చాడు. త్వర లో జరగబోయే మోడీ అమెరికా పర్యటన ను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. భారత్ యూఎస్ఏ దేశాల సంబంధాల ను మరింత లోతు గా బలంగా ముందుకు తీసుకెళ్లేందు కు తాము కృషి చేస్తామని చెప్పుకొచ్చాడు.
అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ ఇప్పటికే షంగ్రిలా సదస్సు లో భారత్ తో అమెరికా అదనపు రక్షణ సహకారాని కి సంబంధించిన పలు అంశాల ను ప్రకటించారని తెలిపారు. ఇరుదేశాల వాణిజ్యం లో చాలా ఇబ్బందులున్నాయన్న కేర్చి... కానీ, భారత్ క్వాడ్ లో సభ్య దేశమని గుర్తు చేశారు. ఇండో - పసిఫిక్ వ్యూహం లో భారత్ చాలా కీలకమైన భాగస్వామని తెలిపారు.
భారత్ ఎందుకు చాలా ముఖ్యమో నేను ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకొంటూ పోగలను అని తెలిపాడు. ఈ సంబంధాలు తమ ఇరు దేశాల కు మాత్రమే ముఖ్యమైనవి కాదు.. బహుముఖంగా చాలా దశల్లో కీలక మైనవి అని చెప్పుకొచ్చాడు . అందుకే ప్రధాని మోదీ తో ఈ అంశాలు మొత్తం చర్చించి.. బంధాన్ని ముందు కు తీసుకెళ్లేందుకు అధ్యక్షుడు బైడెన్ ఎదురు చూస్తున్నారని వివరించారు.
మరోవైపు రక్షణ రంగం లో పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా భారత్, అమెరికా ప్రత్యేక రోడ్‌మ్యాప్ ను రూపొందించుకున్నాయి. ఈ ప్రణాళిక లో భాగంగా పలు మిలిటరీ ప్లాట్‌ఫాంలు, హార్డ్‌వేర్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టుల కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నాయని తెలుస్తుంది.