Begin typing your search above and press return to search.

ట్రంప్ టెంప‌రిత‌నం: అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి వైదొల‌గ‌డానికి కార‌ణ‌మిదే..

By:  Tupaki Desk   |   2 Jun 2020 11:30 AM GMT
ట్రంప్ టెంప‌రిత‌నం: అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి వైదొల‌గ‌డానికి కార‌ణ‌మిదే..
X
దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలతో విసుగుచెందుతున్న అమెరికా అధ్యక్షుడు డొన‌ల్డ్ ట్రంప్ వాటికి కార‌ణాల‌ను ఇత‌రులేన‌ని ఆరోపిస్తూ తీవ్ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. టెంప‌రిత‌నంతో ఇష్టారీతిన నిర్ణ‌యాలు తీసుకుంటూ ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌లో ప‌డేస్తున్నాడు. అంతర్జాతీయ సంస్థలపై త‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాడు. వైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనాకు మ‌ద్ద‌తు ఉంటోంద‌ని ఆరోపిస్తూ.. నిధులు ఇవ్వ‌న‌ని ప్ర‌క‌టించిన అత‌డు ఇప్పుడు డ‌బ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇప్పుడు మ‌రో సంస్థ‌పై ప‌డ్డాడు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డ‌బ్ల్యూటీఓ)ను రద్దు చేయాలని, అది మాకు ఉపయోగపడడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతోపాటు ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌ తన స్వార్థం కోసం ప‌ని చేస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నాడు.

ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచీకరణను అమలుచేసి దాని ద్వారా ప్ర‌పంచంలో త‌న శ‌క్తిని పెంచుకోవాల‌ని భావించి ఆ సంస్థ‌ను ఏర్పాటుచేశారు. అయితే ప్ర‌స్తుతం అమెరికా వక్రబుద్ధి బయటపడుతోంది. త‌మ వైఖ‌రి ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని ముందే త‌ప్పించుకోవాల‌ని చూస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు డ‌బ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతానని ప్ర‌క‌టన‌‌. ఈ విధంగానే మరికొన్నింటి నుంచి కూడా వైదొలిగేం‌దుకు ట్రంప్‌ సిద్ధ‌మయ్యాడు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మ‌హ‌మ్మారి వైరస్‌కు చైనా కార‌ణ‌మ‌ని ప్ర‌క‌టించాల‌ని కోరుతూ ట్రంప్ ప‌ట్టుబ‌డ్డాడు. డ‌బ్ల్యూహెచ్ఓ స్పందించ‌క‌పోవ‌డంతో ప్ర‌తీకారం మొద‌లుపెట్ట‌డు. చైనాతో కుమ్మక్కైంద‌ని ఆరోపిస్తూ నిధులు నిలిపివేస్తామని చెప్పి ఇప్పుడు ఏకంగా సంస్థ వైదొలుగుతామని హెచ్చ‌రిస్తున్నాడు. వైరస్‌ నిరోధానికి తయారుచేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన సభ్యదేశాలన్ని ఏకగ్రీవంగా తీర్మానించాయి.

వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలని డ‌బ్ల్యూహెచ్ఓలోని దేశాలు తెలిపాయి. కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదని నిర్ణయించాయి. దీంతో వైర‌స్ వాక్సిన్‌ తో వ్యాపారం చేయాలని భావించిన అమెరికా, బ్రిటన్‌ల‌కు షాక్ త‌గిలింది. దీనికి అడ్డుక‌ట్ట ప‌డ‌డం తో ట్రంప్‌ లోని మ‌రో వ్య‌క్తి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ప్ర‌జ‌ల అత్యావ‌స‌రం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకుకూర్చున్న స‌మ‌యంలో డ‌బ్ల్యూహెచ్ఓ నిర్ణ‌యం తో ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

ఈ క్ర‌మంలోనే ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా వైదొలగాలని అమెరికా, బ్రిటన్‌ ఫార్మా కంపెనీలు, బడా కార్పొరేట్‌ సంస్ధలు ట్రంప్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో డ‌బ్ల్యూహెచ్ఓ నుంచి బయట‌కు రావాలని ఒత్తిడి తెస్తున్నాయి.