Begin typing your search above and press return to search.

ట్రంప్ భారత్ పర్యటన : ఈ పర్యటనలో సీక్రెట్ ఏజెన్సీ పాత్ర ఏమిటంటే !

By:  Tupaki Desk   |   24 Feb 2020 6:40 AM GMT
ట్రంప్ భారత్ పర్యటన : ఈ పర్యటనలో సీక్రెట్ ఏజెన్సీ పాత్ర ఏమిటంటే !
X
భారత్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన అందరిని ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొదటిసారి డోనాల్డ్ ట్రంప్ ఇండియా లో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డోనాల్డ్ ట్రంప్ . తన కుటుంబంతో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ పర్యటించిన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇక డోనాల్డ్ ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా అహ్మదాబాద్ కు చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నమస్తే ట్రంప్ కార్యక్రమం లో పాల్గొననున్నారు.

అమెరికాకు చెందినసీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, భారత్‌ కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌ లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. వీటన్నింటి లో అత్యంత శక్తివంతమైన భద్రతా సిబ్బంది సీక్రెట్‌ ఏజెన్సీ. అమెరికా అధ్యక్షుడి రక్షణ విషయం లో సీక్రెట్‌ ఏజెన్సీ పాత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటం తో పాటు, అనుకోని ప్రమాదం ఎదురైతే తప్పించుకునే మార్గాలు ప్రణాళికలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుతుంది ఈ అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ. ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే... అవసరమైన రక్తాన్ని కూడా అందుబాటు లో ఉంచుతోంది. ఇక అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ రక్షణ కల్పిస్తూ ఉంటుంది. డోనాల్డ్ ట్రంప్ విశ్రాంతి తీసుకునే గది వరకు కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అనుసరిస్తూనే ఉంటుంది. చట్ట ప్రకారం తను ఒంటరిగా వదిలేయాలని అంటూ డోనాల్డ్ ట్రంప్ కూడా ఏ అధికారిని ఆదేశించ లేడు. 1865 లో ఏర్పాటైన ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తుంది. సుమారు ఏడువేల మందితో కూడిన ఈ విభాగంలో 25 శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. వీరికి ప్రపంచం లో ఏ దేశం కూడా తమ సైన్యాయానికి ఇవ్వని అత్యంత కఠినమైన శిక్షణ ఇస్తూ ఉంటారు. సీక్రెట్‌ సర్వీస్‌ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి.