Begin typing your search above and press return to search.

సోనుసూద్ కి భారత రత్న ఇవ్వాల్సిందే.. రోజురోజుకి పెరిగిపోతున్న డిమాండ్

By:  Tupaki Desk   |   12 Oct 2020 8:30 PM IST
సోనుసూద్ కి భారత రత్న ఇవ్వాల్సిందే.. రోజురోజుకి పెరిగిపోతున్న డిమాండ్
X
'అమ్మ బోమ్మాలీ..’ అంటే చాలు టక్కున గుర్తుకోచ్చేది సోనూ సూద్. ఈ పేరు చెప్పగానే తెలుగులో అతడు నటించిన విలన్ పాత్రలు గుర్తొస్తాయి. తెరపై అత్యంత కర్కసంగా, క్రూరంగా కనిపించే సోనూ సూద్, నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి విధించిన లాక్ ‌డౌన్‌ సమయంలో ముంబైలో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులను సురక్షితంగా స్వంత రాష్ట్రాలకు తరలించిన మంచి వ్యక్తి. వందలాది మంది వలస కార్మికులకు సొంత ఖర్చులతో కొన్ని వందల బస్సుల్ని ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చారు. అలాగే రైళ్లు , విమానంలో కూడా కొంతమందిని తీసుకువచ్చారు.

లాక్ డౌన్ సమయంలో మేము కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అని అంటే ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసిందేమో కానీ , సోను భాయ్ హెల్ప్ కావాలి అంటే , టక్కున వారికీ ఆ సహాయం అందేది. దేశం నలుమూలల నుండి ఎంతమంది , ఏ సహాయం కావాలని అడిగినా కూడా తనకి చేతనైనంత చేశారు. ఒక రాజకీయ నేతనే లాక్ డౌన్ లో ప్రభుత్వానికి విన్నపం చెప్పుకోవడం కంటే సోనూసూద్ కి చెప్పుకుంటే ఆ సమస్య త్వరగా తీరుతుంది అని చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు సోను విధంగా సహాయం చేసారో.

ఈ నేపథ్యంలో సోనూసూద్ కి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. భారత్ రత్న అందుకోవడానికి అన్ని అర్హతలు సోనూసూద్ కి ఉన్నాయని , ఎంతోమందికి ఏమి ఆశించకుండా సేవ చేసిన మహోన్నతమైన వ్యక్తి సోనూసూద్ అని చెప్తున్నారు. తాజాగా కొందరు అభిమానులు సోనూసూద్ కి భారతరత్న ఇవ్వాలని దేశ ప్రధాని మోడీకి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. సోనూసూద్ నిజమైన హీరో అని , ఎంతోమంది వలస కార్మికులు , స్టూడెంట్స్, పేద వారికీ సేవ చేశారని ఆయన ఆ పురష్కారం అందుకోవడానికి అన్ని విధాలా అర్హుడు అంటూ మోడీ కి ట్యాగ్ చేశారు. ఈ ట్విట్ కి చాలామంది లైక్ కొడుతూ దానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ ట్విట్ పై సోనూసూద్ కూడా స్పందించారు. కేవలం దండం పెట్టే ఎమోజిస్ పోస్ట్ చేశారు. ఇకపోతే సోనూసూద్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటించే అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు.