Begin typing your search above and press return to search.

పాఠక దేవుళ్లకు తుపాకీ.కాం విజయదశమి శుభాకాంక్షలు

By:  Tupaki Desk   |   8 Oct 2019 5:23 AM GMT
పాఠక దేవుళ్లకు తుపాకీ.కాం విజయదశమి శుభాకాంక్షలు
X
విజయ దశమి రోజున ఆయుధ పూజ చేయనివారుండరు.. తమతమ వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన పరికరాలు, వస్తువులు, గాడ్జెట్స్.. నిత్యం వాడే వాహనాలు, ఇంట్లోని ఎలక్ట్రానిక్, విద్యుత్ ఉపకరణాలు.. వ్యవసాయదారులైతే తమ పనిముట్లు, పొలాల్లోని మోటార్లు.. అన్నీ ఆయుధాలే. ఆ ఆయుధాలతో పాటు తెలుగు ప్రజల చేతిలో మరో ఆయుధం ఉంది. అది తుపాకీ. ఇది అహింసా తుపాకీ.. ఇది సమాచార తూటాలను పేల్చే డిజిటల్ ఆయుధం.. అదేనండీ మన 'తుపాకీ.కాం' వార్తా వెబ్‌సైట్. తెలుగు రాష్ట్రాల్లోని పాఠకుల చేతిలోని మొబైల్ ఫోన్లకు క్షణక్షణం వార్తలందించే వెబ్‌ మీడియా ఆయుధం. అది కూడా రాజకీయ బురద అంటించుకుని మీడియా అంతా చీలిపోయిన తరుణంలో ఏ గట్టునా నిలవక పాఠకుల పక్షాన మాత్రమే నిలిచి ఎలాంటి రాజకీయ రంగులూ పులుముకోకుండా స్వచ్ఛమైన వార్తలను నిక్కచ్చిగా అందించే ఆయుధం ఈ తుపాకీ.కాం. అందుకే ఆయుధ పూజ రోజున తన పాఠక దేవుళ్లకు తుపాకీ.కాం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది.

'తుపాకీ'. తెలుగు రాష్ట్రాలకు చెందిన వార్తలను అందించడంలో ఏళ్లుగా ముందు వరుసలో నిలుస్తున్న వెబ్‌సైట్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా సంస్థలు డిజిటల్ మీడియాపై దృష్టిపెట్టడానికి ముందే పాఠకుల సౌలభ్యం కోసం, వారు ఎక్కడున్నా వార్తాసమాచారం అందుకునేందుకు వీలుగా మొబైల్ ఫోన్లలో వార్తలు చదువుకునేలా ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించే లక్ష్యంతో చేరువైంది తుపాకీ.కాం. స్వదేశంలోనే కాదు దేశదేశాల్లోనూ ఆదరణ పొందిన అచ్చ తెలుగు డిజిటల్ మీడియా మనది. 24 గంటలూ వార్తావిశేషాలను అందిస్తూ పాఠకాదరణ పొందుతున్న తుపాకీ.కాం రోజురోజుకీ మరింత మంది పాఠకులకు చేరువవుతోంది.

సంఘటనల జరిగిన క్షణాల్లో తన పాఠకులకు సమాచారమివ్వడం, వార్తల వెనుక నిజాలను నిర్భయంగా చెప్పగలిగే తెగువ, జరుగుతున్న పరిణామాలను అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పే విశ్లేషణాత్మకత వంటివి తుపాకీ.కాం ప్రత్యేకతలు. తెలుగులో వార్తా వెబ్ సైట్లు లెక్కలేనన్ని ఉన్నా అన్నీ ఆది నుంచి తుపాకీ.కాం ప్రత్యేకతే వేరు. ఏదో ఒక పార్టీకి వంత పాడడమో, లేదంటే నేతలకు భజన చేయడమో కాకుండా వార్తలను వార్తలా నిష్పాక్షికంగా ఇచ్చే వెబ్ సైట్ ఒక్క తుపాకీ మాత్రమే. ఈ విజయానికి కారణమైన మా పాఠకులకు మరోసారి విజయ దశమి శుభాకాంక్షలు.