జీహెచ్ఎంసీ ఎన్నికల రిపోర్ట్: ఆ 9 డివిజన్లలో 9/2 స్కోర్ టీఆర్ఎస్ vs బీజేపీ!

Thu Nov 19 2020 15:20:55 GMT+0530 (IST)

GHMC Election Report: 9/2 score TRS vs BJP in those 9 divisions

తెలంగాణలోనే కాదు.. ఇప్పుడు దేశమంతా జీహెచ్ఎంసీ ఎన్నికల వైపే చూస్తోంది. దుబ్బాకను దున్నేసిన బీజేపీ గ్రేటర్ ను కూడా కొట్టేస్తే ఇక తెలంగాణలో వచ్చేసారి బీజేపీదే అధికారం అని అంచనా వేస్తోంది. అందుకే కేసీఆర్ కూడా అలెర్ట్ అయ్యారు. స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్రాన్ని డైరెక్టుగా ఢీకొంటూ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు. గెలుపు వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ వేడిలో ఎవరికి వారు సర్వేలు చేసుకుంటూ విజయాలపై ఆరాతీస్తున్నారు.ఈ క్రమంలోనే మా ‘తుపాకీ.కామ్’కు ఒక పొలిటికల్ సర్వే టీం అందించిన రిపోర్ట్ ఆసక్తిగా ఉంది. దీని ప్రకారం ఇప్పటివరకు ఆ సర్వే ఏజెన్సీ అందించిన రిపోర్టు చూస్తే.. జీహెచ్ఎంసీలోని 9 డివిజన్లలో గెలుపు ఎవరది అనేది తేటతెల్లమైంది.

‘రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు’ అని ఆ 9 డివిజన్లలో ఓటర్లను అడిగితే వాళ్లు కుండబద్దలు కొట్టినట్టు తమ అభిప్రాయాన్ని చెప్పారు. వాళ్లు చెప్పిన ప్రకారం ఒక్కొక్క డివిజన్ లో ఆ సర్వే వాళ్లు 500-600 శాంపిల్స్ చేశారంట. ఆ డివిజన్ల రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి.

*సైదాబాద్

టీఆర్ఎస్-- 40.4 %
బీజేపీ -- 43.7 %
కాంగ్రెస్ -- 6.3 %
ఎంఐఎం -- 6.9 %
ఇతరులు -- 2.7 %

*జూబ్లీహిల్స్

టీఆర్ఎస్ -- 40.7 %
బీజేపీ -- 45.4 %
కాంగ్రెస్ -- 6.3 %
ఎంఐఎం -- 5/1 %
ఇతరులు -- 2.5 %

* బీఎన్ రెడ్డినగర్

టీఆర్ఎస్ -- 51.3 %
బీజేపీ -- 41.5 %
కాంగ్రెస్-- 5.5 %
ఇతరులు - 1.7 %

* చింతల్

టీఆర్ఎస్ -- 46.2 %
బీజేపీ -- 30.1 %
కాంగ్రెస్ -- 17.1 %
ఇతరులు -- 2.6 %

*జగద్గిరిగుట్ట

టీఆర్ఎస్-- 58.4 %
బీజేపీ-- 29.9 %
కాంగ్రెస్ -- 8.4 %
ఇతరులు -- 3.3 %

*చంపాపేట్

టీఆర్ఎస్- 50.2 %
బీజేపీ-- 27.7 %
కాంగ్రెస్ -- 18.4 %
ఇతరులు -- 3.7 %

*గాజుల రామారం

టీఆర్ఎస్-- 50.9 %
బీజేపీ -- 25.4 %
కాంగ్రెస్-- 16.2 %
ఇతరులు -- 7.5 %

*సుభాష్ నగర్

టీఆర్ఎస్ -- 50.7 %
బీజేపీ -- 24.5 %
కాంగ్రెస్ -- 18.4 %
ఇతరులు -- 6.4 %

* సూరారం

టీఆర్ఎస్- 49.7 %
బీజేపీ -- 25.4 %
కాంగ్రెస్ -- 17.9 %
ఇతరులు-- 7 %

అయితే ఈ 9 డివిజన్లలో 7 టీఆర్ఎస్ 2 మాత్రమే బీజేపీ మెజారిటీ అని ఆ సర్వే చెబుతోంది. ఇందులో టీడీపీ జనసేన ఓట్ల చీలికను బట్టి 2-3 శాతం ఓట్లు చీలే పరిస్థితి ఉందని కూడా వాళ్లు అంటున్నారు. మొత్తంగా గ్రేటర్ ఫైట్ లో బీజేపీకి అంత ఈజీగా పరిస్థితులు లేవన్న వాస్తవం ఈ సర్వేతో తేలుతోంది. టీఆర్ఎస్ పై అసంతృప్తి ఉన్నా అధికారంలో ఉండడంతో అదే దానికి హెల్ప్ అవుతుందని తెలుస్తోంది. పైగా ఈసారి కేసీఆర్ రంగంలోకి దిగడం కూడా హైదరాబాదీల్లో విశ్వాసాన్ని పురిగొల్పినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. మరి గ్రేటర్ లో అంతిమ విజయం ఎవరిదన్నది ఫలితాల రోజే తేలనుంది.