Begin typing your search above and press return to search.
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం:కేకే
By: Tupaki Desk | 11 Sept 2020 2:00 PM ISTకేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారం చేపట్టిన మొదట్లో ఎన్డీఏకు టీఆర్ఎస్ కాస్తో కూస్తో అనుకూలంగా ఉండేదన్న అభిప్రాయాలున్నాయి. అయితే, 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో సందర్భానుసారంగా కేంద్రంతో సంంబంధాలు నెరిపిన సీఎం కేసీఆర్...2019 ఎన్నికలకు ముందు పూర్తిగా బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ మూడో ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత అనేక విషయాల్లో కేంద్రంతో విభేదించిన కేసీఆర్....తాజాగా జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపుల విషయంలోనూ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే కాలంలో పార్లమెంటు వెలుపల, లోపల కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు టీఆర్ ఎస్ సిద్ధమవుతోంది. నదీ జల వివాదాలు, జీఎస్టీ పరిష్కారం, విద్యుత్ సంస్కరణలు తదితర అంశాలపై టీఆర్ ఎస్ తో కలిసి వచ్చే పార్టీలతో నిరసనలు తెలుపుతామని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు కావొస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి ఇన్నాళ్లూ సందర్భానుసారంగా సహకరించామని, ఇకపై అలా ఉండదని చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రాజ్యాంగ పదవి అని, దానిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని అన్నారు. తనను ఆ పదవికి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ సంప్రదించిందన్నారు.
కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారంలో కేంద్రం ముఖం చాటేస్తోందని, అందుబాటులో ఉన్న 70వేల టీఎంసీలలో కేవలం 40వేల టీఎంసీల నీటినే వినియోగించుకునే స్థితిలో ఉన్నామన్నారు. 10 లక్షలకు బదులు 8.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విడుదల చేయడం సరికాదన్నారు. విద్యుత్ సంస్కరణల పేరిట ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలపై కేంద్రం అజమాయిషీని సహించబోమన్నారు. జాతీయ రహదారులు, నవోదయ పాఠశాలలు, టెక్స్‌టైల్ పార్కు, ఎయిర్‌స్ట్రిప్‌లకు అనుమతి విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు.
పార్లమెంటులో తెలంగాణ కోసం టీఆర్ఎస్ తెలపబోయే నిరసనలకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతిస్తారో లేదో తేల్చుకోవాలని నామా అన్నారు. రాష్ట్ర సమస్యలపై ఏడేళ్లుగా కేంద్రానికి కేసీఆర్ ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న కేంద్రం ఆలోచన సరికాదని, పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని నామా చెప్పారు.