Begin typing your search above and press return to search.

రియల్ రంగంలో తెలుగోళ్లు.. ఏ రేంజ్ అంటే?

By:  Tupaki Desk   |   24 May 2023 6:30 PM IST
రియల్ రంగంలో తెలుగోళ్లు.. ఏ రేంజ్ అంటే?
X
రియల్ రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే టాప్ 100 సంపన్నుల జాబితా విడుదలైంది. మరి.. ఇందులో తెలుగువారి లెక్కేంటి? అన్నది చూస్తే.. మొత్తం జాబితాలోని 100 మందిలో తెలుగు వారు పది మందికి చోటు దక్కింది. ఇందులో టాప్ 10 లో ఒకరు చోటు దక్కించుకోగా.. మిగిలిన 9 మందిలో టాప్ 50లో 8 మందిగా లెక్క తేలారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే టాప్ 50లో నాలుగు స్థానాలు అలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అధినేతలు నిలవగా.. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేతలు ఇద్దరు నిలిచారు.

అలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కు సంబంధించి మనోజ్ నంబూరు రూ.3900 కోట్లతో 29వ స్థానంలో నిలవగా ఇదే సంస్థకు చెందిన మరో ముగ్గురు (సునీల్ బొమ్మిరెడ్డి, సురేంద్ర బొమ్మిరెడ్డి, సురేశ్ బొమ్మిరెడ్డిలు) రూ.1300చొప్పున 49వ స్థానంలో నిలిచారు. మొత్తం పది మందిలో తొమ్మిది మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. ఒకరు మాత్రమే ఏపీకి చెందిన వారు ఉన్నారు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొదటి స్థానంలో జీ అమరేందర్ రెడ్డి నిలిచారు. జీఏఆర్ కార్పొరేషన్ అధినేతగా టాప్ 100లో టాప్ 10 స్థానాన్ని సొంతం చేసుకోగా.. తెలుగురాష్ట్రాల్లో ఆయనే తిరుగులేని అధిక్యతను ప్రదర్శించారు. మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన జూపల్లి రామేశ్వర్‌ రావు కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. ఇక.. ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్న అలయన్స్‌ ఇన్‌ఫ్రాకు సంబంధించి మొత్తం నలుగురు ఉండటం విశేషం.

టాప్ 100 జాబితాను చూసినప్పుడు 2017లో టాప్ 10 లోని వారి కనీస సంపద రూ.3350 కోట్లు ఉంటే.. ఈసారి అది కాస్తా రూ.15వేల కోట్లకు చేరుకుంది . తెలుగు వారికి సంబంధించి టాప్ 10లో నిలిచిన వారిలో తొలి స్థానంలో నిలిచి గవ్వ అమరేందర్ రెడ్డి (జీఏఆర్ కార్పొరేషన్) రూ.15వేల కోట్లతో నిలవగా.. టాప్ 10స్థానంలో ఉన్న జీవీకే ఫ్యామిలీ (తాజ్ జీవీకే హోటల్స్) రూ.700 కోట్లతో నిలిచారు. మొదటి ఐదు స్థానల్లో నిలిచిన వారి సంపదను చూసినా.. మొదటి రెండుస్థానాల్లో తేడా దాదాపు రూ.5500 కోట్లు ఉండటం గమనార్హం.

పేరు సంస్థ పేరు ర్యాంకు సంపద (రూ.కోట్లలో)
జీ అమరేందర్ రెడ్డి జీఏఆర్ కార్పొరేషన్ 10 15000
జూపల్లి రామేశ్వర్ రావు మైహోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 13 9490
సి. వెంకటేశ్వరరెడ్డి అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ 16 5940
ఎస్. సుబ్రమణ్యం రెడ్డి అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ 17 5880
మనోజ్ నంబూరు అలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 29 3900
అయోద్య రామిరరెడ్డి రామ్ కీ 46 1420
సునీల్ బొమ్మిరెడ్డి అలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 49 1300
సురేంద్ర బొమ్మిరెడ్డి అలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 49 1300
సురేశ్ బొమ్మిరెడ్డి అలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 49 1300
జీవీకే రెడ్డి ఫ్యామిలీ తాజ్ జీవీకే 78 700