Begin typing your search above and press return to search.

సెక్స్ లో టూత్ పేస్ట్.. ఈ ట్రెండ్ ను ఫాలో అవ్వాలనుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   21 Sep 2020 7:50 AM GMT
సెక్స్ లో టూత్ పేస్ట్.. ఈ ట్రెండ్ ను ఫాలో అవ్వాలనుకుంటున్నారా?
X
ఒక్కోసారి అంతే.. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఇప్పుడు అలాంటి వేలంవెర్రి ఒకటి వైరల్ గా మారింది. ఇంటర్నెట్ యుగంలో మంచికి మంచి జరుగుతున్నట్లే.. చెడు కూడా బోలెడంత ఫాస్ట్ గా విస్తరిస్తోంది. అబద్ధాలు.. అసత్యాలు ట్రెండింగ్ గా మారి.. పెద్ద ఎత్తున షాకులు ఇస్తున్న వైనం బయటకు వచ్చింది. అయినా.. టూత్ పేస్టుతో సెక్సు ఏమిటంటారా? ఈ పైత్యం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

ఎందుకంటే.. సెక్సు చేసే సమయంలో మరింత బాగా చేసేందుకు వీలుగా.. టూత్ పేస్టు ను ల్యూబ్రికెంట్ గా వాడే వెర్రితనం ఒకటి ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతోంది. లాజిక్ మిస్ అయి.. గుడ్డిగా ఫాలో అయిన వారందరికి దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు సెక్సు చేసే సమయంలో యోని టైట్ గా ఉండటంతో కొందరికి అంగప్రవేశం కష్టంగా మారుతుంటుంది. దీంతో.. వివిధ రకాల లుబ్రికేంట్లను యోని వద్ద రాసి సెక్సు చేస్తుంటారు.

తాజాగా టూత్ పేస్టును ఇలా వాడొచ్చన్న ప్రచారం జరగటం.. దాన్ని నమ్మి ఫాలో అయిన వారంతా దారుణమైన అనుభవాల్ని చవి చూస్తున్నారు. సాధారణంగా టుబ్రికెంట్లుగా వాడే నూనెల్లో జారుడు స్వభావం ఉంటుంది. వీటిని వాడటం వల్ల ఎలాంటి గాయాలు కావు. అందుకు భిన్నంగా టూత్ పేస్టులు ఉంటాయన్న ప్రాథమిక విషయాన్ని పలువురు మర్చిపోతున్నారు. ఎందుకంటే.. టూత్ పేస్టులు స్మూత్ గా ఉండవు. గరకుగా ఉంటాయి. వీటిని మర్మాంగాలకు రాసి సెక్సు చేస్తే.. ఆ రాపిడికి గాయాలు కావటం ఖాయమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

టూత్ పేస్టులకు పిండి స్వభావం ఉంటుంది. అవి త్వరగా పొడిగా మారే తత్త్వం ఉంటుంది.సెక్సు చేస్తున్నప్పుడు బాగున్నట్లు అనిపించినా.. తర్వాత దాని కారణంగా ఎదురయ్యే చెడు ప్రభావాలే ఎక్కువని చెప్పాలి. యోని ప్రాంతం సున్నితంగా ఉండటంతో గాయాలు సులువుగా మానవన్నది మర్చిపోకూడదు. ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతున్న దీని కారణంగా ఎంతోమంది దారుణమైన అనుభవాలు ఎదురు కావటం.. తాము పడుతున్న ఇబ్బందుల గురించి వారు వాపోతున్నారు. వైద్యులు సైతం టూత్ పేస్టుల్ని టూబ్రికెంట్లుగా వాడటం తెలివితక్కువ పనిగా తేల్చటమే కాదు.. ప్రమాదకరమన్నది మర్చిపోకూడదని హెచ్చరిస్తున్నారు. సో.. ఇలాంటి ట్రెండింగ్ విషయాల్ని గుడ్డిగా ఫాలో కాకుండా ఉండటం చాలా మంచిది.