Begin typing your search above and press return to search.

తిరుమ‌ల దారుల్లో బాదుడే బాదుడు ?

By:  Tupaki Desk   |   2 July 2022 2:30 AM GMT
తిరుమ‌ల దారుల్లో బాదుడే బాదుడు ?
X
తిరుమ‌ల దారుల్లో కూడా ఆర్టీసీ బ‌స్సు ధ‌ర‌లు చుక్క‌లు చూపెట్ట‌నున్నాయి. తిరుమ‌ల - తిరుప‌తి ఎక్స్ ప్రెస్ సర్వీసు ధ‌ర 15 రూపాయ‌లు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. నాలుగేళ్ల‌లో పెరిగిన ధ‌ర న‌ల‌భై రూపాయ‌లు అని తేలింది. గ‌తంలో 50 రూపాయ‌లు ఉండే టికెట్ ధ‌ర తాజా గా పెంచిన ధ‌ర‌ల‌తో 90 రూపాయ‌ల‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం పిల్ల‌ల టికెట్ కు సంబంధించి న‌ల‌భై ఐదు రూపాయ‌లు ఉండగా ఇప్పుడు యాభై రూపాయ‌లు చేశారు. ఇదే విధంగా ప‌లు చోట్ల ఆర్టీసీ ధ‌ర‌ల పె రుగుద‌ల అన్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదేవిధంగా స్టూడెంట్ పాసుల‌కూ ఎక్క‌డా మిన‌హాయింపు అన్న‌దే లేదు. ఇప్ప‌టిదాకా 155 రూపాయ‌లు వ‌సూలు చేసే స్టూడెంట్ పాస్ ను ఇప్పుడు 300 రూపాయ‌లు చేశారు.

స్పెష‌ల్ పాస్ లు 245 రూపాయ‌లు నుంచి 300కు పెంచారు. నెల‌వారీ పాసుల్లో నాలుగు కిలోమీట‌ర్ల‌కు సంబంధించి ఉండే ధ‌ర 55 రూపాయ‌లు కాస్త 120 రూపాయ‌ల‌కు చేరుకుంది. 8కిలోమీటర్లకు సంబంధించి 65 నుంచి 150 రూపాయ‌లు చేశారు. గ‌రిష్టంగా 22 కిలోమీట‌ర్ల దూరానికి 105 ఉండ‌గా, 270 రూపాయ‌ల చొప్పున వ‌సూలు చేసేందుకు రంగం సిద్ధం అయింది. రిటైల్ గా కొనుగోలు చేసే డీజిల్ ధ‌ర బ‌య‌ట మార్కెట్ క‌న్నా త‌క్కువ‌గానే ఉన్నా డీజిల్ సెస్సు పేరిట ఆర్టీసీ అడ్డ‌గోలుగా దోచేస్తుంద‌ని విప‌క్షం అంటోంది.

వాస్త‌వానికి ధ‌ర 107 రూపాయ‌లు ఉన్నప్పుడే బ‌ల్క్ లో దాని ధ‌ర 97 నుంచి 99 మ‌ధ్య ఉంటుంద‌ని, ఇదంతా రెండు నెల‌ల కింద‌ట జ‌రిగిన వ్య‌వ‌హారం అని, అంటే రెండు నెల‌ల కింద‌ట భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా డీజిల్ కొనుగోలు చేసి ప్ర‌స్తుత ధ‌ర (లీట‌రు 130 రూపాయ‌ల‌కు పైగా ఉంద‌ని చెప్పి) అధికంగా ఉంద‌ని చెప్పి, న‌ష్టాల పేరిట ప్ర‌యాణికుల నుంచి డ‌బ్బులు పిండుకోవాల‌ని చూడ‌డం భావ్యంగా లేద‌ని అంటోంది.