అంత్యక్రియలకు 10వేలమంది... మూడు గ్రామాల్లో లాక్‌డౌన్

Mon Jul 06 2020 22:34:14 GMT+0530 (IST)

10 thousand for funerals ... Lockout in three villages

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇద్దరు కలవడానికే భయంతో వణికిపోతున్నారు. వైరస్ నేపథ్యంలో సొంత బంధువులు చనిపోతేనే వెళ్లటం లేదు. కానీ వైరస్ నిబంధలను ఏమాత్రం ఖాతరు చేయకుండా .అసోంలోని నాగావ్ జిల్లాలో ఓ మతబోధకుడి అంత్యక్రియలకు ఏకంగా 10 వేల మంది హాజరు కావడం కలకలం రేపింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంత్యక్రియలకు హాజరు కావటానికి కేవలం 20 మంది మాత్రమే హాజరవ్వాలని నిబంధనలు విధించింది.కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా..వైరస్ వ్యాపిస్తుందనే భయం గానీ బాధత్యగానీ లేకుండా అఖిల భారత జమైత్ ఉలేమా ఉపాధ్యక్షుడు ఈశాన్య రాష్ట్రాల అమిర్–ఇ–షరియత్ అయిన మౌలానా ఖైరుల్ ఇస్లాం ముఫ్తీ వృద్ధాప్యంతో గురువారం మృతి చెందగా జులై 2న కుటుంబ సభ్యులు నిర్వహించిన అంత్యక్రియలకు ఏకంగా 10వేల మందికిపైగా హాజరయ్యారు. అలా హాజరైనవారు ఏమాత్రం భౌతిక దూరాన్ని కూడా పాటించలేదు.

ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఇస్లాం కుమారుడు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన అమీనుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ విధించారు. మరోవైపు వైరస్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కాగా రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య దాదాపు 10వేలకు చేరుకుంది.