రవి ప్రకాష్ నోరు విప్పితే.. రేవంత్ కు డేంజరా!

Wed Oct 09 2019 17:39:41 GMT+0530 (IST)

Threat for Revanth Reddy with TV9 Ex CEO Ravi Prakash

జైలు పాలైన టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాష్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం సాటి జర్నలిస్టులు కూడా ఆయనను పరామర్శిస్తున్న దాఖలాలు లేవు. తెలుగు జర్నలిజంలో సంచలనంగా నిలిచిన టీవీ నైన్ సీఈవోగా దశాబ్ద కాలానికి పైనే ఉన్నా.. ఇప్పుడు కనీసం జర్నలిస్టులు ఎవరూ ఆయనతో ములాఖత్ కు వెళ్లడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నేతలు కూడా రవి ప్రకాష్ ను పట్టించుకోవడం లేదు - ఒక్క రేవంత్ రెడ్డి తప్ప!జైలుకు వెళ్లి మరీ రవి ప్రకాష్ ను పరామర్శించారు రేవంత్ రెడ్డి. రవి ప్రకాష్ అలా జైలుకు వెళ్లాడో లేదో ఇంతలోనే రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శించి వచ్చాడు. మరీ అంత వేగిరంగా ఎందుకు? వీరిద్దరి మధ్యన బంధం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

అసలు రవి ప్రకాష్ జైలు పాలైతే రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శిస్తాడని ఎవ్వరూ అనుకుని ఉండరు. వీరిద్దరి మధ్యన ఇంత వరకూ ఎక్కడా బాహాటంగా అనుబంధం కనిపించలేదు. అయినప్పటికీ రవి ప్రకాష్ ను వెళ్లి పరామర్శించాడు రేవంత్ రెడ్డి.వీరి బంధం ఇన్నాళ్లూ బయటకు  కనిపించలేదు కానీ - లోలోన మాత్రం వీరి బంధం గట్టిగానే ఉందని ఇప్పుడు స్పష్టం అవుతోంది.

రేవంత్ రెడ్డికి సంబంధించిన అనేక సీక్రెట్స్ రవి ప్రకాష్ వద్ద ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. రేవంత్ రెడ్డిని రవి ప్రకాష్ శాసించే పరిస్థితుల్లో ఉన్నాడని - రేవంత్ రెడ్డికి చీకటి మనిషిలా రవి ప్రకాష్ పని చేశాడనే ప్రచారం జరుగుతూ ఉంది. అలా రేవంత్ రెడ్డి గుట్లుముట్లను బాగా ఎరిగాడట రవి ప్రకాష్.ఇప్పుడు అతడు జైలుకు వెళ్లడంతో రేవంత్ రెడ్డి బాగా టెన్షన్ పడుతూ ఉన్నాడట.

జైల్లో ఉన్న రవి ప్రకాష్ తన గుట్టుముట్లను ఏం బయటపెడతాడో అనే భయం అతడిలో ఉందట. ఈ నేపథ్యంలో నే రవి ప్రకాష్ ను రేవంత్ రెడ్డి పరామర్శించాడని ప్రచారం జరుగుతూ ఉంది. మరి అసలు సంగతేమిటో! రవి ప్రకాష్ నోరు విప్పితే మాత్రం రేవంత్ రెడ్డి పరిస్థితి డేంజర్లో పడిపోతుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. ఇక ఎంప్లయిస్ బోనస్ డబ్బులను కూడా రవి ప్రకాష్ మింగేశాడనే ప్రచారమూ సాగుతోంది. రవి ప్రకాష్ వ్యవహారంపై సీబీఐ - ఈడీల విచారణ కోరుతూ ఇప్పటికే వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి లేఖ రాసిన సంగతీ తెలిసిందే.