ఈ ‘మాన్షన్’ చాలా కాస్ట్లీ గురు.. గంటకు 51 వేలు అద్దె

Sun Oct 18 2020 13:00:20 GMT+0530 (IST)

This 'mansion?' is very costly  51 thousand rent per hour

న్యూ ఢిల్లీ:  అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ ఖరీదైన భవంతి ఉంది. ఇంద్ర భవనాన్ని తలపించే ఆ భవంతిలో ఉండాలంటే మాత్రం గంటకు ఏడు వందల డాలర్లు (దాదాపు 51500 రూపాయలు) చొప్పున చెల్లించాలి. బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ హారీ మేఘన్ మార్కెల్ దంపతులు తాము అమెరికా వచ్చినప్పుడు విలాసవంతంగా ఉండేందుకు ఈ భవంతిని ఎంతో ముచ్చట పడి కొనుగోలు చేశారు.  ఈ భవంతిని 2003లో నిర్మించారు. అయితే హారీ దంపతులు మాత్రం 147 మిలియన్ డాలర్లు (దాదాపు 108 కోట్ల రూపాయలు) వెచ్చించి దీన్ని కొనుగోలు చేశారు. ‘మాంటెసిటో మాన్షన్’ గా పిలిచే ఈ భవంతిని ఇప్పడు అద్దెకివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రెంటల్ వెబ్‌సైట్ గిగ్‌స్టార్‌లో ఓ ప్రకటన వెలువడింది.ఈ భవనం విశేషాలివి..

5.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవంతి విస్తరించి ఉన్నది. సుమారు 14563 చదరపు అడుగుల్లో ఇటాలియన్ శైలిలో దీన్ని నిర్మించారు. దీనికి ‘ది చేత్యూ’ అని మరో పేరు కూడా ఉన్నది. అయితే పాటలు వీడియోలు సినిమా షూటింగ్‌లతోపాటు మ్యూజియం కోసం దీన్ని అద్దెకు ఇస్తారని గంటకు ఏడు వందల డాలర్లు (దాదాపు 51500 రూపాయలు) చొప్పున కనీసం పది గంటలకు ఇవ్వనున్నారు. ఆవరణలో స్విమ్మింగ్పూల్  చూడటానికి రెండు కళ్లు సరిపోవు. బహుశా ప్రపంచంలో ఇంత అందమైన స్విమ్మింగ్ పూల్ను మేము ఎక్కడా చూడలేదని సందర్శకులు చెబుతున్నారు. టెన్నీస్ కోర్టు టీ హౌజ్ చిల్డ్రన్ కాటేజీలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ భవనంలోనే ఓ గది నిండా వైన్ బాటిళ్లు ఉన్నాయి. అయితే వాటిని మాత్రం ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు. అంతేకాక ఆ భవంతిలో మద్యం తాగేందుకు అనుమతి లేదు.

ఎక్కడుందంటే..

లాస్ ఏంజెలిస్ నగరం నుంచి దాదాపు రెండు గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడికొచ్చే పర్యాటకులు చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరాదు. ఎడల్ట్ వీడియో షూటింగ్‌లను అనుమతించరు.