సెకండ్ డోస్ తీసుకోకపోతే జరిగేది ఇదే!

Thu May 13 2021 10:00:01 GMT+0530 (IST)

This is what happens if you do not take the second dose

ప్రపంచంలో ముందుగా వ్యాక్సిన్ తయారు చేశామని ప్రకటించుకున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. స్వదేశీ టీకా అంటూ ఘనంగా ప్రచారం కూడా జరిగింది. కానీ.. నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ కనీసం 20 కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ అందలేదని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇందులో కూడా మరో విషయం ఏమంటే.. చాలా మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందకపోవడం!చాలా మందికి ఫస్ట్ డోస్ వేసి అలా వెయిటింగ్ లిస్టులో ఉంచుతున్నారు. అయితే.. సెకండ్ డోస్ గడువు దాటుతున్నా.. వ్యాక్సిన్ అందట్లేదట చాలా మందికి. దీంతో.. తమకు సెకండ్ డోస్ ఎప్పుడు ఇస్తారంటూ ఎదురు చూస్తున్నారు చాలా మంది. ఇన్ టైమ్ లో బూస్టర్ డోస్ ఇవ్వకపోతే.. మొదటి దాని పవర్ తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే.. మొదటి డోస్ వేయించుకున్నా.. ఉపయోగం లేనట్టే కదా అని ఆవేదనకు గురవుతున్నారు.

ఇక ఒక్క డోసుకూడా వేయించుకోలని వారి పరిస్థితి మరోవిధంగా ఉంది. కనీసం తొలి డోసు వేయించుకుంటే కరోనా నుంచి కాస్తైనా రక్షణ దొరుకుతుందన్నది వీళ్ల ఆలోచన. ఇలా రెండు వర్గాల నుంచీ డిమాండ్ పెరుగుతోంది. అటు చూస్తే.. వ్యాక్సిన్ సరఫరా పెద్దగా లేదు. ఉత్పత్తి కూడా డిమాండ్ కు తగినట్టుగా లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో.. వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే వారు ఆందోళన చెందుతున్నారు.

దీనిపై ప్రముఖ వ్యాక్సినోలజిస్ట్ గగన్ దీప్ స్పందించారు. కొవిషీల్డ్ విషయంలో పలు దేశాల్లో బూస్టర్ డోస్ గడువు వేరేగా ఉందని పేర్కొన్నట్టు సమాచారం. కెనడా వంటి దేశాల్లో తొలి డోస్ వేయించుకున్న తర్వాత 16 వారాలకు సెకండ్ డోస్ వేస్తున్నారని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందువల్ల దేశంలోని వారు సెకండ్ డోస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం.