Begin typing your search above and press return to search.

హేమంత్ హత్య కేసులో అసలు ట్విస్ట్ ఇదే..వెలుగులోకి వచ్చిన మరో నిజం!

By:  Tupaki Desk   |   28 Sep 2020 10:50 AM GMT
హేమంత్ హత్య కేసులో అసలు ట్విస్ట్ ఇదే..వెలుగులోకి వచ్చిన మరో నిజం!
X
హైదరాబాద్ నగరంలోని చాంద్ ‌నగర్ ‌లో జరిగిన పరువు హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసు పై పోలీసులు విచారణ మొదలుపెట్టినప్పటి నుండి గంటకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ పరువు హత్య కేసు విచారణలో ఒక్కొక్కటిగా అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆ విషయం ఏమిటంటే .. హేమంత్ - అవంతి ప్రేమ కంటే ..ముందే వారి కుటుంబాలకి పరిచయం ఉంది. మృతుడు హేమంత్ తల్లి రాణి - అవంతి తల్లి అర్చనలు మంచి స్నేహితులు. ఆ స్నేహమే హేమంత్ - అవంతి ల మధ్య ప్రేమకి కారణమై .. హేమంత్ హత్య కి దారితీసింది.

ఈ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు సీరియస్ ‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు. హేమంత్ హత్య కేసులో ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్టు చేశారు. అలాగే, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. హేమంత్ - అవంతిలకు పరిచయం ఏర్పడకముందే వారిద్దరి తల్లులు క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. అలాగే , ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లేవారని తెలిసింది. అలా కలిసిమెలిసివుంటూ తమ కుమార్తెను తీసుకెళ్లి హేమంత్ ప్రేమ వివాహం చేసుకోవడాన్ని అవంతి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. హేమంత్ - అవంతిలు ప్రేమ వివాహం చేసుకోకముందు - ఇరువురి కుటుంబ సభ్యులు ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లేవారు.

హేమంత్ తల్లి రాణి బ్యూటీషియన్. ఈ క్రమంలో అవంతి వాళ్ల ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈమె వెళ్లేది. ఆ సమయంలోనే హేమంత్ తల్లితో అవంతి దగ్గరైంది. పలుమార్లు అవాంతికి కూడా మేకప్ వేసిందట. ఆ తర్వాత హేమంత్ ‌తో పరిచయం ఏర్పడి - అది ప్రేమగా మారింది. వారిద్దరి ప్రేమ వ్యవహారం కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంట్లో వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య స్నేహం చెడిపోయింది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడంతోనే అవంతి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక హేమంత్ ను చంపేశారని పోలీసులు వెల్లడించారు. మొత్తంగా చూస్తే ఈ రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉన్నా పిల్లల సంతోషం కోసం అవంతి కుటుంబం ఏ మాత్రం ఆలోచన చేయకుండా - పరువు పోయింది అని పదే పదే అదే బాధలో ఉంటూ పగ - ప్రతీకారం అంటూ హేమంత్ ‌ను దారుణంగా హత్య చేయించారు. వారి పగకి ఇప్పుడు కూతురి అవంతి వందేళ్ల జీవితం అగమ్య గోచరంగా మారింది.