Begin typing your search above and press return to search.

మహాభారతం జరిగింది అనడానికి సాక్ష్యం ఇదే..!

By:  Tupaki Desk   |   1 March 2021 8:30 AM GMT
మహాభారతం జరిగింది అనడానికి సాక్ష్యం ఇదే..!
X
మహాభారతం అనేది ఓ ఇతిహాస గాథ మాత్రమే. అందులోని పాత్రలన్నీ కల్పితాలే అని వాదించేవాళ్లు కొందరు. లేదు మహాభారతం నిజంగా జరిగింది.. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక కూడా నిజంగానే ఉంది అని చెప్పేవాళ్లు మరికొందరు. ఈ వాదన ఎలా ఉన్నా.. ఇప్పుడు మహాభారతంలోని ఓ ఘట్టానికి చారిత్రక ఆధారాలు దొరికాయి.

‘ ద్రోణుడు, ద్రుపదుడు ఒకే గురుకులంలో విద్యనభ్యసిస్తారు. ప్రాణస్నేహితులు.. అయితే ద్రోణాచార్యుడే బ్రాహ్మణుడు.. ద్రుపదుడు రాజవంశీయుడు.. చిన్ననాడు ద్రుపదుడు అన స్నేహితుడైన ద్రోణుడికి నేను మహారాజునయ్యాక నీకు అర్ద రాజ్య పట్టాభిషేకం చేస్తానని మాట ఇస్తాడు. కొంత కాలానికి ద్రుపదుడు పాంచాల దేశానికి మహారాజు అవుతాడు.. కానీ ద్రోణాచార్యుడు మాత్రం పేదరికంతో ఎంతో ఇబ్బందులు పడుతుంటాడు. భార్య, పిల్లలకు భోజనం పెట్టేందుకు అతడికి స్థోమత ఉండదు. దీంతో చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి కొలువుకు వెళ్లి.. తాను పరిచయం చేసుకుంటాడు. చిన్ననాటి మాటను గుర్తుచేస్తాడు.. కానీ ద్రుపదుడు మాత్రం అతడిని అవమానించి పంపిస్తాడు.. దీంతో అవమానభారతంతో ద్రోణాచార్యుడు.. హస్తినకు చేరుకొని అక్కడ పాండవులకు, కౌరవులకు విలువిద్యను నేర్పిస్తాడు. ఆ తర్వాత తన ప్రియ శిష్యుడైన అర్జునుడిని ఓ కోరిక కోరతాడు.

తనను అవమానించిన ద్రుపదుడిని ఓడించాలని.. అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని అంటాడు. వెంటనే అర్జునుడు వెళ్లి ద్రుపదుడిని ఓడించి .. అతడిని బంధించి ద్రోణాచార్యుడి కాళ్ల దగ్గర పడేస్తాడు.. ఆ తర్వాత ఆ పాంచాల రాజ్యం ద్రోణాచార్యుడి ఆధీనంలోనే ఉంటుంది.’ ఇది మహాభారతంలోని ఓ కథ.. అయితే ఇప్పుడీ పాంచాల దేశం నిజంగానే ఉందని అంటున్నారు చరిత్రకారులు..

మహాభారతము లో ద్రౌపది తండ్రి దృపదుడు పాలించిన పాంచాల దేశం ఇప్పటి ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీ ప్రాంతం అంటున్నారు చరిత్రకారులు. మహాభారత కాలం తరువాత ఈ ప్రదేశం 2000 బీసీలో లో అహిర్ జాతి వాళ్ళ స్వాధీనంలోకి వెళ్లిందట. అప్పట్లో ఈ ప్రదేశము అతి పెద్ద నగరంగా ఉండేది. అయితే ఇక్కడ ఒక పెద్ద కట్టడం బయట పడ్డది. ఈ కట్టడం మొత్తం ఒక పెద్ద పిరమిడ్ ఆకారంలో ఉంది. పైన ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. ఇది ప్రస్తుతం యూపీలోని రాంనగర్ అనే గ్రామంలో ఉంది.

12 వ శతాబ్దం లో ముస్లిం దండయాత్రల సమయంలో ఈ కట్టడం కూడా దాడికి గురైంది. అయినప్పటికీ ఈ కట్టడం ఇప్పటికీ చాలా ఎత్తులో ఉంది.. పైగా దాని మీద 22 మీటర్ల ఎత్తయిన శివ లింగం ఉంది. ఇది ఎంత పెద్దది అంటే మొత్తం 187 హెక్టార్ల స్థలంలో ఈ పిరమిడ్ నిర్మించబడింది. దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో 1871 లో అలెక్జాoడర్ కన్నింగ్ హామ్ అనే బ్రిటీష్ కమాండర్ ఈ కట్టడాన్ని కనుక్కున్నాడు. అయితే ఈ ప్రాంతంపై ఇంకా పరిశోధనలు సాగాల్సి ఉందని.. దీన్ని చారిత్రక కట్టడంగా గుర్తించి అభివృద్ధి చేయాలని పురావస్తు శాస్త్రవేత్తలు కోరుతున్నారు.