శృంగారానికి బెస్ట్ టైం ఇదేనట..

Sun Jul 05 2020 06:00:05 GMT+0530 (IST)

This is the Best Time for Romance

శృంగారం దివ్యౌషధం అంటారు. అది ఏ సమయంలో చేస్తే బాగా ఆస్వాదించవచ్చనే దానిపై ఇటీవల పరిశోధన చేశారు. పెళ్లయిన కొత్తలో దంపతులు రతి క్రీడను ఆస్వాదిస్తుంటారు కానీ.. క్రమంగా లైంగికాసక్తి తగ్గిపోతుంది. ఉరుకులు పరుగుల జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఈ సమస్యను అధిగమించడానికే భార్యభర్తలు ఏకాంతంగా గడపటానికి మధ్యాహ్నం పూట విరామం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. పట్టపగలు శారీరకంగా కలవడం ఎలాగున్నా.. తెల్లవారు జామున లైంగిక చర్యలో పాల్గొనడానికి పురుషులు ఉత్సాహం చూపుతారు.శృంగారాన్ని ఆస్వాదించడానికి ఉదయమే బెస్ట్ టైం అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయాన్నే రతి క్రీడలో పాల్గొనడం వల్ల ఆలుమగలు చక్కటి మూడ్‌తో రోజును ప్రారంభించడానికి వీలవుతుందట. రాత్రంతా నిద్రించడం వల్ల శరీరానికి తగిన విశ్రాంతి లభించడంతోపాటు.. వేకువ జామున టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయులు అధికంగా ఉంటాయి.

మహిళలకు ప్రతినెలా హర్మోన్ సైకిల్ ఎలా ఉంటుందో.. అదే తరహాలో పురుషులకు మార్నింగ్ టైంలో మంచి మూడ్ ఉంటుంది. పగటి వేళ ఇంత జోష్ ఉండదు. రాత్రిపూట మగాళ్లు చాలా కేరింగ్ గా ఉంటారు. పురుషుల్లో శృంగారానికి అత్యంత అవసరమైన టెస్టో స్టిరాన్ హార్మోన్ లైంగిక కోరికలను ప్రభావితం చేస్తుంది. అందుకే చాలా మంది లో ఉదయం పూట అంగ స్తంభనలు ఉంటుంటాయి. దాన్నే ఇంగ్లిష్ లో మార్నింగ్ వుడ్ అంటుంటారు.

ఉదయం పూట అంగ స్తంభనలు అసంకల్పితంగా కలుగుతాయి. ఆరోగ్యం వంతులైన పురుషుల్లో యుక్త వయస్కుల్లో అది చాలా సాధారణంగా జరిగేదే. అంతే కానీ ఉదయం పూట అంగస్తంభనలు ఉన్నాయంటే వారికి అందమైన అమ్మాయిలు కలలోకి వచ్చారని కాదు. సో శృంగారానికి బెస్ట్ టైం ఉదయమే. ఆ టైంను సద్వినియోగం చేసుకోవాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.

ఉదయం వేళ శృంగారం చేస్తే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి దూరం చేసి ఉత్సాహం గా ఉంచుతుంది.  ఉదయం శృంగారంతో రోజంతా ఉత్సాహం గా ఉంటారు. డయాబెటిస్ ముప్పు కూడా తగ్గుతుంది.  మైగ్రేయిన్ కూడా తగ్గు ముఖం పడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతుంది. ముఖ వర్చస్తు పెరుగుతుంది. పురుషుల్లో టెస్టో స్టిరాన్ ఉదయం ఎక్కువగా విడుదలై ఎక్కువ సేపు శృంగారం లో పాల్గొనగలుగుతారు. వీర్య కణాలు కూడా చురుకుగా ఉంటాయి. సంతానం కావాలనుకునే వారికి ఇదే సరైన సమయం.