టీడీపీ విషయంలో జగన్ అసలు లక్ష్యం ఇదీ..!!

Mon Mar 27 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

This is jagan's real aim in the case of TDP..!!

వైసీపీ అధినేత సీఎం జగన్ పరిస్తితి ఇప్పుడు కక్కలేక.. మింగలేక అన్నట్టుగా మారిపోయింది. తన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారని.. పేర్కొంటూ..ఆయన వేటు వేశారు. దరిమిలా.. ఇప్పుడు అన్ని వేళ్లూ కూడా వైసీపీ అధినేత జగన్ వైపే చూపిస్తున్నాయి. దీనికి కారణం.. ఆయన ఏ నలుగురు పై వేటు వేశారో.. మరోపార్టీ టీడీపీ వైపు నుంచి అదే నలుగురిని తన పంచన చేర్చుకున్న విధానమే ఇప్పుడు జగన్కు సింపతీని కరువు చేసింది.ఇప్పుడు జగన్ ఏం చెబుతారు? "2019లో నేను టికెట్ ఇచ్చాను. వారిని గెలిపించాను. కానీ.. ఆ నలుగురు నా పార్టీకి నాకు కూడా ద్రోహం చేశారు.  నన్ను కాదనిపోయి టీడీపీ కి ఓటు వేశారు" అని!  కానీ ఇప్పుడు ఇలా చెప్పుకొనేందుకు ఆయన ఆంతరాత్మే అంగీకరించడం లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత.. ఏలూరు లో నిర్వహించిన ఆసరా నిధుల విడుదల సభలో సీఎం జగన్ పన్నెత్తు మాట కూడా అనలేదు. ఎక్కడా ప్రస్తావించనూ లేదు.

దీనికి కారణం.. తానేదైతే.. నీతి సూత్రం చెప్పాలని అనుకుంటున్నారో.. "నేను టికెట్ ఇచ్చాను.. గెలిపించాను.. మోసం చేశారు" అని అదే నీతి సూత్రం.. టీడీపీ నుంచి తాను తీసుకున్న ఆనలుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ అడ్డం వస్తోంది. ఎందుకంటే.. టీడీపీ కూడా అదే నమ్మకంతో వారికి టికెట్ ఇచ్చింది. వారిని తనకు అవసరం లేకపోయినా.. పార్టీని బలహీన పరచాలనే ఉద్దేశంతో జగన్ వారిని తన పంచకు చేర్చుకున్నారు. వాస్తవానికి జగన్ లక్ష్యం ఈ విషయంలోవేరేగా ఉంది.

ఇదీ.. అసలు లక్ష్యం!!

టీడీపీ నుంచి  ఆరు నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలను లాగేయాలన్నది జగన్ అసలు లక్ష్యం. ఎందుకంటే.. టీడీపీ కి గత ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు దక్కారు. సో.. దీనికి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. దీనిని లేకుండా చేయాలంటే.. టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యను 16-17కు కుదించాలి. 18 ఉంటే ప్రతిపక్ష హోదా దక్కుతుంది.. కాబట్టి.. అలా కాకుండా చేయాలని అనుకునే వారిని తనవైపు మళ్లించుకున్నారు. ఈ వరుసలో గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు.

పైగా.. ఇంత మందిని చేర్చుకున్నా.. రేపు టీడీపీ కోర్టుకువెళ్తే.. న్యాయస్తానం ఆదేశంతో అయినా.. ప్రతిపక్ష హోదా ఇవ్వక తప్పదు(అసోంలో అదే జరిగింది. అక్కడిఅధికారపక్షం బీజేపీ.. ప్రతిపక్ష సభ్యులను లాగేసుకుని.. ముగ్గురిని మిగిల్చింది. దీంతో ప్రతిపక్షం హోదా కోల్పోయింది. కోర్టుకువెళ్లి.. ఒక్కరు ఉన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న తీర్పు తెచ్చుకుంది) అందుకే జగన్ ప్రయత్నం విరమించారు. ఇక ఈ పరిణామాల క్రమంలోనే.. జగన్ నోరు విప్పలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.